Manchu Lakshmi And Indigo :  మంచు లక్ష్మి ఇండిగో విమానయాన సంస్థతో వివాదానికి దిగారు. గోవా నుంచి వస్తూంటే తన సూట్ కేసును ఇండిగో సంస్థ పక్కకు పెట్టేసిందని.. అక్కడే వదిలేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఎవరైనా హెల్ప్ చేయాలని ట్వీట్ పెట్టారు. 





[మంచు లక్ష్మి ఫిర్యాదుపై ఇండిగో సంస్థ కూడా వెంటే స్పందించింది. మీ బ్యాగులో నిషేధిత వస్తువులు ఉన్నాయని సెక్యూరిటీ వారు స్వాధీనం చేసుకున్నారని తెలిపింది. కాసేపటికి మీరు సహకరించి .. చెక్ అయ్యారని మరో ట్వీట్‌లో తెలిపింది. 





అయితే ఆ నిషేధ వస్తువులు ఏమిటో కూడా మంచు లక్ష్మి చెప్పారు. ఓ ఫోర్క్ స్ఫూన్‌తోపాటు వంట గదిలో వినియోగించే కత్తి మాత్రమే ఉన్నాయి. వాటిని చెక్ చేసి సెక్యూరిటీ ట్యాగ్ వేయలేదని ఆమె అంటున్నారు. [ 





 అయితే ఇదంతా ఇండిగో హరాస్ మెంటేనని తన కళ్ల ముందు సెక్యూరిటీ ట్యాగ్ పెట్టలేదని మంచు లక్ష్మి ఆరోపించారు. 





అంటే మంచు లక్ష్మి బ్యాగులోల కత్తి, ఫోర్క్ స్ఫూన్ ఉండటం వల్ల వాటిని సెక్యూరిటీ వాళ్లు అనుమతించకపోవడంతో సమస్య వచ్చింది.  అయితే ఎయిర్ పోర్టు సెక్యూరిటీ ప్రోటోకాల్స్ చాలా స్ట్రిక్టుగా ఉంటాయి.  అలాంటి వాటిని రవాణాకు అనుమతించే అవకాశం ఉండదు. వాటిని ఆపారని  మంచు లక్ష్మి విమానాన సంస్థపై  మండిపడుతున్నారు.