Manchu family will be targeted by the Bhuma faction:  మంచు కుటుంబంలో ఏర్పడిన వివాదాలు అది వారి కుటుంబ సమస్య నుంచి ఇంకా పెద్దగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మోహన్ బాబు మనోజ్ భార్య భూమా మౌనికతో పాటు పిల్లలను ఈ విషయంలోకి తీసుకు వచ్చారు. అంతే కాదు మనోజ్, మౌనిక దంపతులకు అన్యాయం జరుగుతోందన్న అభిప్రాయం భూమా వర్గీయుల్లో ఏర్పడటం సహజమే. అందుకే భూమా వర్గం ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. 


మంచు మనోజ్ భార్య భూమా మౌనిక ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఫ్యాక్షన్ నేపధ్యం ఉన్నది.  భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డి అంటే రాష్ట్రంలో పేరున్న నేతలు  నాగిరెడ్డి అనారోగ్యంతో శోభానాగిరెడ్డి ప్రమాదంలో చనిపోవడంతో చిన్న వయసులోనే భూమా అఖిలప్రియ రాజకీయాల్లోకి  రావాల్సివచ్చింది. తండ్రి ఉన్నప్పుడు తండ్రి చాటున రాజకీయం చేసినా తర్వాత తండ్రి వర్గాన్ని నడిపించడంలో సక్సెస్ అయ్యారు.  హైదరాబాద్‌లో జరిగిన ఓ భూవివాదంలో ఆమె కొంత మంది ప్రముఖుల్ని కిడ్నాప్ చేయించారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ కేసులో జైలుకు కూడా వెళ్లారు.అయితే భూమా అఖిలప్రియ ఎప్పుడూ తగ్గలేదు. తన తండ్రిని మరిపించే రాజకీయాలు చేస్తున్నారు.      


Also Read:  ఎవరీ వినయ్ మహేశ్వరి? మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గొడవలో కీలకంగా మారిన బయట వ్యక్తి ఎవరు?


భూమా అఖిలప్రియ సోదరి మౌనిక. అఖిలప్రియ కోసం మౌనిక రాజకీయ ప్రచారం కూడా చేస్తారు. ఇప్పుడు తన సోదరికి మెట్టినింట్లో అన్యాయం జరుగుతోందంటే ఆమె ఖచ్చితంగా రంగంలోకి దిగుతారని అనుకోవచ్చు. ఇప్పటి వరకూ వారి ఫ్యామిలీ ఇష్యూను వారు పరిష్కరించకుంటారని.. తాము జోక్యం చేసుకుంటే ఇంకా ఎక్కువ సమస్యలు వస్తాయని సైలెంట్ ఉన్నారు. కొంత మంది భూమా వర్గీయుల్ని మాత్రం..  మనోజ్ ఇంటి వద్ద సెక్యూరిటీగా ఉండేందుకు పంపారని అంటున్నారు. ఇప్పుడు వివాదం ముదరడంతో ఇక నేరుగా ఫ్యాక్షన్ స్టైల్లో మోహన్ బాబు ఫ్యామిలీతో భూమా వర్గం డీల్  చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 


Also Read: మనోజ్‌ను ఇంట్లో నుంచి గెంటేసిన విష్ణు - రెండు వర్గాల బౌన్సర్ల మధ్య ఘర్షణ - ఆత్మగౌరవ పోరాటమన్న మనోజ్


మంచు మనోజ్ ఇప్పటికి తాము ఆత్మగౌరవ పోరాటం చేస్తున్నామని అంటున్నారు. తన భార్య, బిడ్డల రక్షణ కోసమే మాట్లాడుతున్నానని .. పోరాటం చేస్తున్నానని చెబుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఆయన నుంచి గెంటేశారు. ఈ సమయంలో ఆయన వెనక్కి తగ్గలేరు.  తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యే అవకాశం ఉంది.తన భార్య తరపున పొలిటికల్.. ఫ్యాక్షన్ వర్గం పవర్ ను వాడుకుంటే మోహన్ బాబు ఫ్యామిలికీ చాలా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇలాంటి సమస్యలు ఉన్నాయన్న భయం పోలీసులకు ఆయన రాసిన లేఖలో స్పష్టమయిందని అనుకోవచ్చు. మొత్తంగా కుటుంబ గొడవలు ఫ్యాక్షన్ వైపు వెళ్తే మరింత సంచలనం అయ్యే అవకాశాలు ఉన్నాయి.