Mancherial District Crime news: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఫ్లెఓవర్ బ్రిడ్జి వద్ద శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో బైక్ పెట్రోల్ ట్యాంకు పగిలిపోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తికి మంటలు అంటుకొని అక్కడికక్కడే మృతి చెందాడు. బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల జాతీయ రహదారి పంచముఖి ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో బైకు దహనమైన ఘటనలో మృతి చెందిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. బెల్లంపల్లి వన్ టౌన్ ఎస్.హెచ్.ఓ బన్సీలాల్ తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు తాండూర్ మండలం ఐబీకి చెందిన తోట రవిగా గుర్తించామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.