Viral News in Telugu: "మీరు ఈ లింక్ క్లిక్ చేస్తే చాలు ఇంత డబ్బు మీ అకౌంట్‌లోకి వచ్చేస్తుంది". ఈ తరహా మెసేజ్‌లు రోజూ వస్తూనే ఉంటాయి. ఇది జస్ట్ ఓ ఉదాహరణ మాత్రమే. ఇంతకు మించి రకరకాల మెసేజ్‌లు, ఫోన్‌ కాల్స్ (Scam Callers) వస్తున్నాయి. ట్రేస్ కూడా చేయలేని నంబర్ నుంచి కాల్ చేసి ఏదేదో చెప్తారు. మెల్లగా వాళ్ల బుట్టలో పడేసి అకౌంట్‌లోని డబ్బంతా లాగేస్తారు. ఆ తరవాత అవి రికవరీ కూడా అవ్వవు. పోలీస్ స్టేషన్‌, బ్యాంక్ చుట్టూ తిరిగి తిరిగి అలిసిపోవడమే మన వంతవుతుంది. ఇలా రోజూ వందలాది మంది ఈ తరహా స్కామ్‌లలో బాధితులవుతున్నారు. కొందరు చాలా సులువుగా మోసపోతున్నారు. కానీ...ఓ యూజర్ మాత్రం ఆ స్కామర్‌కే చుక్కలు చూపించాడు. ఫోన్‌పేలో ఈ మధ్య ఓ స్కామ్ జరుగుతోంది. రూ.8,999 అకౌంట్‌లో జమ అవుతాయని చెప్పి ఓ లింక్ పంపించి క్లిక్ చేయమని చెబుతున్నారు స్కామర్స్. ఇది తెలియక కొంత మంది అకౌంట్‌లో ఉన్న డబ్బంతా పోగొట్టుకుంటున్నారు. అయితే..ఓ యూజర్ మాత్రం ఫోన్‌ కాల్‌లో మాట్లాడుతూనే..అదంతా మరో ఫోన్‌తో వీడియో తీశాడు. 






యూపీఐ పిన్‌తో సహా అన్ని వివరాలూ ఇవ్వాలని ఆ స్కామ్‌ యూజర్‌ని అడిగాడు. "డబ్బులు రిసీవ్ చేసుకోడానికి ఇవన్నీ ఎందుకు" అని యూజర్ ప్రశ్నించాడు. అప్పటి వరకూ చాలా పొలైట్‌గా సర్, సర్ అని మాట్లాడిన ఆ స్కామర్ ఒక్కసారిగా రూట్ మార్చాడు. కానీ యూజర్ మాత్రం వదల్లేదు. అలానే మాటల్లో పెట్టి చాలా సేపు ఆ సంభాషణ కొనసాగించాడు. "నువ్వో ఫేక్‌ నంబర్ నుంచి కాల్ చేశావని నాకు అర్థమైంది. ఇదంతా  స్కామ్ అని కూడా తెలుస్తోంది. నేను ఎందుకు పిన్ నంబర్ ఇవ్వాలి" అని ప్రశ్నించాడు యూజర్. దానికి ఆ స్కామర్ "నేను ఫేక్ అని మీకెలా తెలుసు..? అలా ఇంకోసారి అంటే కేసు పెడతాను" అని రివర్స్‌లో అటాక్ చేశాడు. 


ఆ తరవాత యూజర్ కాస్త గట్టిగానే మందలించాడు. ఇలాంటి స్కామ్‌లు చాలానే చూశామని, మోసం చేయాలని చూస్తే ఊరుకోనని వార్నింగ్ ఇచ్చాడు. దానికి ఆ స్కామర్ ఏ మాత్రం బెదరకపోగా తనను ఎవరూ ట్రేస్ చేయలేరని తేల్చి చెప్పాడు. అంతే కాదు. ఇదంతా వీడియో తీస్తున్నానని చెప్పగానే...ఫోన్‌నే హ్యాక్ చేస్తా అని బెదిరించాడు. కనీసం కొంతమందికైనా ఈ స్కామ్ గురించి తెలుస్తుందని, కచ్చితంగా ఈ వీడియోని వైరల్ చేస్తానని ఆ యూజర్ చెప్పాడు. వెంటనే ఆ కేటుగాడు కాల్ కట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


Also Read: Viral News: క్రిమినల్‌ని పట్టుకునేందుకు పోలీస్ సాహసం, బిజీ రోడ్డుపై ప్రాణాలకు తెగించి - వీడియో