Digital snan for Rs 1,100 at Mahakumbh: ఈ ఆలోచన నాకెందుకు వచ్చిందని ఫీలవమాకండి.. మీకెందుకు రాలేదని బాధపడండి అని ఓ సినిమాలో కమెడియన్ డైలాగ్ ఉంటుంది. కానీ మహాకుంభమేళాలో హడావుడి చేస్తున్న ఈ యువకుడ్ని చూస్తే ఛ.. ఈ ఐడియా మనకు ఎందుకు రాలేదని ఖచ్చితంగా ఫీలవుతాం. ఇంతకీ అతను ఏం చేస్తున్నాడో తెలుసా.. భక్తులకు డిజిటల్ స్నాన్ చేయిస్తున్నాడు. అందుకు రూ. పదకొండు వందలు వసూలు చేస్తున్నాడు. విచిత్రమైన ఐడియాతో రోజుకు లక్షలు సంపాదిస్తున్నాడు.
ప్రయాగరాజ్ కు చెందిన దీపక్ గోయల్.. ప్రయాగ్ ఎంటర్ ప్రైజెస్ అనే కంపెనీ పెట్టాడు. కుంభమేళాలో సేవలు అందిస్తున్నాడు. అతను అందిస్తున్న సేవ ఏమిటంటే.. డిజిటల్ స్నానాలు చేయించడం. 144 ఏళ్లకు ఓ సారి వచ్చే కుంభమేళాలో స్నానం చేయడం ప్రతి ఒక్క హిందువు కల. అయితే చాలా మంది దాన్ని నెరవేర్చుకోలేరు. అలాంటి వారి కోసమే దీపక్ గోయల్ ఈ సర్వీస్ చేపట్టారు. ఒక్కొక్కరు ఫోటో మెయిలో..వాట్సాపో చేసి.. రూ. పదకొండు వందలు పంపితే.. వారి ఫోటోను కాపీ తీసుకుని.. వీడియో కాల్ చూపిస్తూ మరీ.. ఆ ఫోటోలకు స్నానం చేయిస్తాడు. అదే డిజిటల్ స్నాన్.
కుంభమేళా ప్రారంభ రోజుల్లో మోనాలిసా భోంస్లే హైలెట్ అయితే ఇప్పుడు దీపక్ గోయల్ వంతు. ఆయన గురించి చర్చించుకోవడం ఎక్కువైపోయింది. ఇలాంటి టెక్నిక్‌లు ఏ దేశంలోనూ ఎవరూ పట్టుకోలేరని ప్రశంసిస్తున్నారు.
స్టార్టప్ ప్రారంభిస్తే వెంటనే బిలియన్ల ఆదాయం వస్తుందని కొంత మంది సెటైర్లు వేస్తున్నారు.