Sanjay Raut Death Threat:
పుణేలో అరెస్ట్..
ఉద్దవ్ థాక్రే శివసేన పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్‌కు హత్యా బెదిరింపులు రావడం సంచలనం రేపింది. రౌత్ ఇచ్చిన సమాచారం మేరకు విచారణ చేపట్టిన పోలీసులు గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశారు. పుణెలో అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం నిందితుడిని ప్రశ్నిస్తున్నారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో బెదిరింపులకు పాల్పడినట్టు పోలీసులు తేల్చారు. అయితే...ఈ వ్యక్తి ఆ గ్యాంగ్‌తో సంబంధం ఉందా లేదా అన్నది విచారణ తరవాతే తేలనుంది.
"సంజయ్ రౌత్‌ను హత్య చేస్తామని బెదిరించిన నిందితుడిని పుణేలో అరెస్ట్ చేశాం. లారెన్స్ బిష్ణోయ్ పేరు వాడుకుని ఇలా వార్నింగ్ ఇచ్చాడు. గతంలో సల్మాన్ ఖాన్‌కు కూడా ఇదే విధంగా బెదిరింపులు వచ్చాయి. ఈ రెండు కేసులపైనా అతడిని ప్రశ్నిస్తున్నాం. బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉందా లేదా అన్నది విచారణ జరిపి తేలుస్తాం"
- ముంబయి పోలీసులు