Heart Attack Cases:


నోయిడాలో ఘటన..


నోయిడాలో షాకింగ్ ఘటన జరిగింది. క్రికెట్ ఆడుతుండగానే ఓ వ్యక్తి ఉన్నట్టుండి పిచ్‌లో కుప్ప కూలిపోయాడు. రన్‌ తీస్తుండగా పిచ్ మధ్యలోకి రాగానే ఆగిపోయాడు. అందరూ చూస్తుండగానే కింద పడిపోయాడు. వెంటనే మిగతా ప్లేయర్స్ పరిగెత్తుకొచ్చారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ ఆ వ్యక్తి అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. పోలీసులు వెంటనే పోస్ట్‌మార్టం చేయించారు. గుండెపోటుతోనే చనిపోయినట్టు వైద్యులు నిర్ధరించారు. మృతుడి పేరు వికాస్. గతంలో ఓ సారి కరోనా సోకింది. ఆ తరవాత కోలుకున్నాడు. ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండడానికి ఢిల్లీ, నోయిడాలో రెగ్యులర్‌గా క్రికెట్ ఆడుతున్నాడు. నోయిడాలో మ్యాచ్ ఆడేందుకు వచ్చాడు. అప్పటి వరకూ రన్స్ తీసిన వ్యక్తి ఉన్నట్టుండి పిచ్‌ మధ్యలోకి వెళ్లగానే ఆగిపోయాడు. చుట్టూ ఉన్న వాళ్లంతా ఏమైందోనని అలా చూస్తూ ఉండిపోయారు. ఇంతలోనే నిలబడ్డ చోటే కింద పడిపోయాడు వికాస్. వెంటనే కీపర్‌ పరిగెత్తుకొచ్చాడు. ఆ తరవాత మిగతా ప్లేయర్స్ సాయంతో హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. ఎక్కువగా పరిగెత్తడం వల్ల గుండెపోటు వచ్చి ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు. కొన్నేళ్లుగా గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అందరినీ బలి తీసుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా హార్ట్ అటాక్‌ల సంఖ్య పెరుగుతున్నప్పటికీ..భారత్‌లో ఐదేళ్లలో ఇది మరింత పెరిగింది. 30-40 ఏళ్ల మధ్య వాళ్లకే ఎక్కువగా హార్ట్ అటాక్స్ వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. 


ఇటీవల యూపీలో అల్మోరా జిల్లాలో దారుణం జరిగింది. 17 ఏళ్ల కుర్రాడు క్రికెట్ ఆడిన వెంటనే నీళ్లు తాగి ప్రాణాలు కోల్పోయాడు. డిసెంబర్ 30వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. పదోతరగతి చదువుతున్న ప్రిన్స్ సైనీ ఫ్రెండ్స్‌తో కలిసి క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు. ఆట అయిపోయిన వెంటనే కడుపు నిండా చల్లని నీళ్లు తాగాడు. తరవాత కాసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఒక్కసారిగా షాక్ అయిన స్నేహితులు బాధితుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతానికి ఇది అనుమానాస్పద మృతిగానే మిగిలిపోయింది. గుండెపోటు వల్ల చనిపోయి ఉంటాడని ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే...తల్లిదండ్రులు మాత్రం పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. గతంలోనూ ఇలాంటి మరణాలు నమోదయ్యాయి. క్రికెట్ ఆడుతుండగానే ఓ వ్యక్తి కుప్ప కూలిపోయాడు. గుండెపోటుతో మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.


ఎవరికైనా హఠాత్తుగా గుండె ఆగిపోతే... వారి పక్కన ఉన్నవారు మళ్ళీ గుండెను కొట్టుకునేలా చేసే ప్రక్రియ CPR. దీని గురించి ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. ఇది ఎలా చేయాలో తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. మీ ఎదురుగా ఎవరైనా స్పృహ కోల్పోయినట్టు కనిపిస్తే తేలికగా తీసుకోకండి. గుండెపోటు వల్ల వారు పడిపోతే, ఆ వ్యక్తి వద్దకు వెళ్లి రెండు భుజాలను పట్టుకుని గట్టిగా ఊపుతూ వారిని లేపడానికి ప్రయత్నించాలి. ఎంతగా ఊపినా వారు లేవకపోతే, వారు ఊపిరి తీసుకుంటున్నారో లేదో గమనించాలి. ఊపిరి తీసుకోకపోతే వెంటనే ఆ వ్యక్తికి గాలి ఆడేలాగా చేయాలి. 


Also Read: Lakshadweep Tourism: లక్షద్వీప్‌లో భారీ తాజ్ రిసార్ట్స్, టాటా గ్రూప్‌‌నకు బాగా కలిసొచ్చిన లక్!