Maharashtra Accident:
హైవేపై ప్రమాదం..
నాసిక్-షిరిడీ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ తెల్లవారుజామున ట్రక్కు, బస్ ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. షిరిడీ సాయి భక్తులతో వస్తున్న బస్సు ట్రక్‌ను ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. కొందరు తీవ్రంగా గాయపడ్డారు. పథారే వద్ద ప్రమాదం సంభవించినట్టు పోలీసులు తెలిపారు. ప్రాథమిక సమచారం ప్రకారం...ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45-50 మంది ఉన్నారు. వీళ్లంతా ముంబయిలోని అంబేర్‌నాథఅ వాసులే. చనిపోయిన 10 మందిలో 7గురు మహిళలు కాగా మరో ముగ్గురు పురుషులు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని ప్రకటించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాని అధికారులను ఆదేశించారు. ఇటీవలే జనవరి 9 న మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మినీ బస్ బోల్తాపడింది. ఈ ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోగా...6గురు తీవ్రంగా గాయపడ్డారు. గతేడాది డిసెంబర్‌లో గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నేషనల్ హైవే 48పై నవశ్రీ ప్రాంతంలో ఓ బస్సు, కారు ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 9 మంది మృతి చెందారు. బస్‌లోని ప్రయాణికులంతా అహ్మదాబాద్‌లో ఓ వేడుకలకు హాజరైన తరవాత వల్సాద్‌కు తిరిగి వస్తున్నారు. రేష్మ గ్రామం వద్ద ఓ కార్‌ని ఢీ కొట్టింది.అయితే...ప్రాథమికంగా తేలిందేంటంటే...కార్ రాంగ్ రూట్‌లో వచ్చి ముందు డివైడ్‌రను ఢీకొట్టింది. ఆ తరవాత బస్‌వైపు దూసుకెళ్లింది. కార్ డ్రైవర్ నిద్ర మత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.