Madhya Pradesh Wedding Gift Kits: 



మధ్యప్రదేశ్‌లో..


మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వమే సామూహిక వివాహాలు నిర్వహిస్తోంది. అంతే కాదు. ఆ కొత్త జంటలకు వెడ్డింగ్ కిట్స్ (Wedding Kits) కూడా ఇస్తోంది. వెనకబడిన వర్గాల పెళ్లి ఖర్చులు తగ్గించేందుకు బీజేపీ ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చింది. అయితే...ఈ కిట్స్‌లో కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు కూడా ఉండటం వివాదాస్పదమవుతోంది. ఇటీవలే 200 జంటలకు పెళ్లి చేసిన ప్రభుత్వం వాళ్లందరికీ కిట్స్ అందించింది. అన్నింట్లోనూ కండోమ్స్ కనిపించాయి. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి కన్య వివాహ్ (Mukhyamantri Kanya Vivah)కింద ఈ కిట్స్ అందిస్తున్నారు. అయితే..తాండ్ల అనే ఓ ఏరియాలో సామూహిక వివాహాలు జరగ్గా..ఆ జంటలకు కిట్స్ అందించారు చౌహాన్. వాటిలో కండోమ్స్ కనిపించడం వల్ల ఆ జంటలు షాక్ అయ్యాయి. కుటుంబ నియంత్రణలో భాగంగా కావాలనే ప్రభుత్వం ఇలా కిట్స్‌లో వాటిని పంపిణీ చేస్తోందని కొందరు చెబుతున్నారు. అయితే.. సీనియర్ అఫీషియల్స్  మాత్రం దీంతో మాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెబుతున్నారు. 


"కండోమ్‌లు, గర్భ నిరోధక మాత్రలు కిట్స్‌లో కనిపించాయని చెబుతున్నారు. దీంతో మాకెలాంటి సంబంధం లేదు. ముఖ్యమంత్రి కన్య వివాహ్‌ పథకంలో ఇచ్చే కిట్స్‌లో ఇవి లేనే లేవు. స్థానిక అధికారులకు ఇప్పటికే దీనిపై ఆరా తీయాలని ఆదేశించాం. ఫ్యామిలీ ప్లానింగ్‌కి సంబంధించి వేరే విధంగా అవగాహన కల్పించాలని చెప్పాం. ఇంటింటికీ తిరగాలని ఆదేశాలు జారీ చేశాం. ఇప్పుడు కిట్స్‌ పంపిణీ చేసిన ప్రాంతంలో ఎక్కువగా గిరిజనులే ఉంటారు. వీళ్లకు అక్షరాస్యత కూడా తక్కువే. ఉన్నట్టుండి కిట్స్‌లో కండోమ్స్ చూసే సరికి అసహనానికి గురయ్యారు. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటాం"


- అధికారులు 






జిల్లా కుటంబ సంక్షేమ అధికారి కూడా దీనిపై స్పందించారు. కన్‌ఫ్యూజన్ కారణంగానే ఇలా జరిగి ఉండొచ్చని వెల్లడించారు. మళ్లీ మళ్లీ ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని చెప్పారు. 


"ఈ ఈవెంట్‌లో ఏదో చిన్న కన్‌ఫ్యూజన్‌ జరిగింది. 200 జంటలకు పెళ్లి చేశారు. వాళ్లందరికీ కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించాలన్న ఆరాటంలో కొందరు ఇలా చేసి ఉంటారు. కొంతమంది ఆరోగ్య కార్యకర్తలు వెళ్లి వాళ్లకు వివరించి చెప్పారు. కానీ...వాళ్లు సరిగా అర్థం చేసుకోలేకపోయారు"


- సీనియర్ అధికారి 


ఈ కిట్‌లో కండోమ్ ప్యాకెట్‌లు, గర్భ నిరోధక మాత్రలు, రెండు ప్రెగ్నెన్సీ కిట్‌లు కూడా ఉన్నాయి. వీటితో పాటు ఓ అద్దం, బొట్టు బిళ్లల ప్యాకెట్‌లు, రెండు టవల్స్, ఖర్చీఫ్‌లు కూడా అందిస్తోంది ప్రభుత్వం. 2006 ఏప్రిల్‌లో మధ్యప్రదేశ్‌లో ఈ పథకం ప్రారంభమైంది. ఇందులో భాగంగా నిరుపేద వర్గాలకు చెందిన వధువుకి రూ.50 వేల ఆర్థిక సాయమూ అందిస్తారు. 


Also Read: Wrestlers Protest: పతకాలు గంగలో కలపాలనుకోవడం వాళ్ల ఇష్టం, ఆరోపణలు నిజమైతే అరెస్ట్ అవుతాను - బ్రిజ్ భూషణ్