Madhya Pradesh Man Travels 290 Km Hanging Under Train Coach: తెలుగు సినిమాల్లో  ట్రైన్ వెళ్తూ ఉంటుంది. చక్రాల మధ్యలో రైలుకు ఉన్న కొన్ని కడ్డీల్ని పట్టుకుని హీరో జర్నీ చేస్తూ ఉంటాడు. తర్వాత మెల్లగా పైకి వచ్చి ఫైటింగ్ చేస్తాడు. ఇలాంటి సీన్లు చాలా పాతకాలం నుంచి మనం చూస్తూనే ఉన్నాం. కానీ రియల్ ఎవరైనా చేయగలరా?.  అసాధ్యం. చేస్తే చచ్చిపోతారు. కానీ మధ్యప్రదేశ్‌లోని ఓ వ్యక్తి మాత్రం అలా ప్రయాణించడానికి చాలా సేఫ్ వే చూసుకున్నారు.         


మధ్యప్రదేశ్‌ ఇటార్సీ నుంచి జబల్పూర్ వరకూ దనాపూర్ ఎక్స్ ప్రెస్ ప్రయాణిస్తూ ఉంటుంది. ఇటీవల ఈ ట్రైన్ జబల్పూర్ చేరుకుంది. ఎప్పట్లానే రైల్వే ఉద్యోగులు ట్రైన్ గేర్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేయడం ప్రారంచారు. ఎస్ ఫోర్ బోగీ దగ్గరకు వచ్చి కింద చూసేసరికి ఏదో కదులుతున్నట్లుగా అనిపించింది. ఏదైనా కొండ చిలువ  అక్కడ చేరిందేమో అనుకున్నారుు. కానీ కాస్త పట్టి చూస్తే అక్కడో మనిషి ఉన్నాడని గుర్తించారు. గేర్ బాక్స్ దగ్గర చిన్న సందు ఉంటుంది. ఆ సందులోకి దూరి కాళ్లు చూపి పడుకున్నాడు ఆ వ్యక్తి. అక్కడ మనుషులు దూరవచ్చని ఆ రైల్వే ఉద్యోగులకుూ అప్పటి వరకూ తెలియదు.   




Also Read : Adult content creator : సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కన్నా అడల్ట్ కంటెంట్ క్రియేటర్‌గా మారడం బెటర్ - Phd వదిలేసి ఈ అందగత్తె చేస్తున్నది అదే !







ఆ వ్యక్తి అప్పటికే 290 కిలోమీటర్లు ప్రయాణించినట్లుగా గుర్తించారు. అంత దూరం.. రైలుకు వేలాడటం కన్నా ఘోరంగా జర్నీ చేయడంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. టిక్కెట్ కు డబ్బులు లేక అలా ప్రయాణించాడా లేకపోతే మరో కారణం ఉందా అన్నదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.              


Also Read: పొలిటికల్ 'పండిట్' మన మన్మోహన్ సింగ్ - దేశ గతిని మార్చిన ఆర్థికవేత్త