AAP MLA DEAD: పంజాబ్‌లో మరోసారి తుపాకీ పేలింది. ఈసారి ఏకంగా అధికారపార్టీ ఆప్‌ ఎమ్మెల్యే గుర్‌ప్రీత్‌ గోగి(Gurpreet Gogi) తూటాకు బలయ్యారు. బుల్లెట్  గాయాలతో రక్తపుమడుగులో పడి ఉన్న ఆయన్ను హుటాహుటినా లుథియానాలోని ఆస్పత్రికి తరలించగా...అప్పటికే  ఎమ్మెల్యే గురుప్రీత్‌గోగి  మరణించాడని వైద్యులు తెలిపారు.


 లూథియానా(Ludhiana) వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన గురుప్రీత్‌గోగి...నియోజకవర్గ ప్రజలతో సమావేశమయ్యారు. అధికారిక కార్యక్రమాలన్నీ ముగించుకుని ఘుమర్‌మండిలోని ఇంటికి తిరిగి వచ్చారు. అర్థరాత్రి 12 గంటల సమయంలో తన గదిలో తుపాకీ పేలిన శబ్ధం వినిపించగా...వెళ్లి చూసేసరికి  తన భర్త రక్తపు మడుగులో పడి ఉన్నాడని  ఎమ్మెల్యే భార్య సుఖ్‌చైన్‌ గోగి  తెలిపారు. తలపై బుల్లెట్‌( Bullet) గాయాలతోఉన్న  ఎమ్మెల్యేను హుటాహుటిన డీఎంసీ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఎమ్మెల్యే గుర్‌ప్రీత్‌గోగి చనిపోయినట్లు నిర్థరించారు. 


అనుమానాస్పద మృతిగా  కేసు నమోదు చేసిన  పోలీసులు విచారణ జరుగుతున్నారు. ఎమ్మెల్యే  ఆత్మహత్య చేసుకున్నారా లేక ప్రమాదవశాత్తు తుపాకీ పేలిందా లేదా   ఎవరైనా ఆయనపై కాల్పులు  జరిపారా అన్నది విచారణలో తేలాల్సి ఉంది. కుటుంబ సభ్యులు మాత్రం అతను ప్రమాదవశాత్తు కాల్చుకున్నాడని చెబుతున్నారని...పోస్టుమార్టం(Postmartam)  నివేదిక వస్తేగానీ ఏ  విషయం చెప్పలేమని పోలీసులు తెలిపారు. 2022లోఆప్‌లో చేరిన గుర్‌ప్రీత్‌గోగి..అసెంబ్లీ   ఎన్నికల్లో రెండుసార్లు కాంగ్రెస్  మాజీ ఎమ్మెల్యే భరత్‌ భూషణ్‌ అషును ఓడించారు.