APCOB Recruitment: ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్(APCOB) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం, కర్నూలు జిల్లాల్లోని డిస్ట్రిక్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు (DCCB)ల్లో 251 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ,8 పీజీ ఉత్తీర్ణ88తతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజు జనరల్/బీసీ అభ్యర్థులకు రూ.700. ఎస్సీ, ఎస్టీ, పీసీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.500 చెల్లించాలి. సరైన అర్హతలు ఉన్నవారు జనవరి 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ పరిశీలన ఆధారంగా ఉద్యోగాల ఎంపిక ఉంటుంది.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 251 పోస్టులు
1. అసిస్టెంట్ మేనేజర్: 50 పోస్టులు
⏩ గుంటూరు- 31 పోస్టులు
అర్హత: 31.10.2024 నాటికి గుర్తింపు పొందిన యునివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా 55 శాతం మార్కులతో కామర్స్ డిగ్రీ లేదా ఏదైనా విభాగంలో పీజీ ఉత్తీర్ణత. ఆంగ్ల భాషా పరిజ్ఞానం, స్థానిక భాష (తెలుగు)లో ప్రావీణ్యంతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి కలిగి ఉండాలి.
⏩ శ్రీకాకుళం- 19 పోస్టులు

2. స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్: 201 పోస్టులు
⏩ గుంటూరు- 50 పోస్టులు
అర్హత: 31.10.2024 నాటికి గుర్తింపు పొందిన యునివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఆంగ్ల భాషా పరిజ్ఞానం, స్థానిక భాష (తెలుగు)లో ప్రావీణ్యంతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి కలిగి ఉండాలి.
⏩ కృష్ణా- 66 పోస్టులు
అర్హత: 31.10.2024 నాటికి గుర్తింపు పొందిన యునివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఆంగ్ల భాషా పరిజ్ఞానం, స్థానిక భాష (తెలుగు)లో ప్రావీణ్యంతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి కలిగి ఉండాలి.
⏩ కర్నూలు- 50 పోస్టులు
అర్హత: 31.10.2024 నాటికి గుర్తింపు పొందిన యునివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఆంగ్ల భాషా పరిజ్ఞానం, స్థానిక భాష (తెలుగు)లో ప్రావీణ్యంతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి కలిగి ఉండాలి.
⏩ శ్రీకాకుళం- 35 పోస్టులు
అర్హత: 31.10.2024 నాటికి గుర్తింపు పొందిన యునివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఆంగ్ల భాషా పరిజ్ఞానం, స్థానిక భాష (తెలుగు)లో ప్రావీణ్యం అవసరం. కంప్యూటర్ల పరిజ్ఞానం తప్పనిసరి.
వయోపరిమితి: 31.10.2024 నాటికి 20 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, దివ్యాంగ(జనరల్- 10 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు 13 సంవత్సరాలు) వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్/బీసీ అభ్యర్థులకు రూ.700; ఎస్సీ, ఎస్టీ, పీసీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.500.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ పరిశీలన ఆధారంగా.
జీతం: నెలకు రూ.26,080- రూ.57,860.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22.01.2025.
Srikakulam DCCB Assistant Manager
Srikakulam DCCB Staff Assistant