High Mileage Affordable Bikes For Ola-Uber-Rapido: ఈ కాలంలో ఓలా, ఉబర్ & ర్యాపిడో వంటి ప్లాట్‌ఫామ్‌లు యువతకు & పార్ట్‌టైమ్ సంపాదన కోసం చూస్తున్న వ్యక్తులకు గొప్ప అవకాశంగా మారాయి. ఈ పని కోసం అద్భుతమైన మైలేజీని ఇచ్చే & తక్కువ ధరలో దొరికే బైక్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. బైక్ టాక్సీ సర్వీస్ అందించడానికి అద్భుతంగా పనికొచ్చే 5 బైక్‌లను మేం షార్ట్‌లిస్ట్ చేశాం. ఈ బైక్‌లు మీ బడ్జెట్‌లోనే తక్కువ ధరకు లభిస్తాయి, ఇంధనాన్ని ఆదా చేస్తాయి & ఎక్కువ కాలం మెరుగైన పనితీరును కూడా ఇస్తాయి. తక్కువ నిర్వహణ, ఎక్కువ మైలేజ్ కారణంగా మీరు ప్రతిరోజూ బాగా సంపాదించవచ్చు.
హీరో స్ప్లెండర్ ప్లస్ (Hero Splendor Plus)హీరో స్ప్లెండర్ ప్లస్ ఈ జాబితాలో మొదటి బైక్ & భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టూవీలర్లలో ఇది ఒకటి. ఈ బండికి 97.2cc ఇంజిన్ ఉంది, ఇది లీటరు పెట్రోల్‌తో 60 కిలోమీటర్ల నుంచి 70 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుంది. ఇప్పుడొస్తున్న బైక్‌లతో పోలిస్తే ఇది చాలా మంచి మైలేజీ. ఈ బండిని రఫ్ అండ్ టఫ్‌గా వాడేవాళ్లు కూడా ఉన్నారు. పైగా ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్, మార్కెట్లో రూ. 95,000 కంటే తక్కువ ధరకు లభిస్తుంది.
బజాజ్ ప్లాటినా 100 (Bajaj Platina 100)బజాజ్ ప్లాటినా 100 కూడా అద్భుతమైన మైలేజ్ & సౌకర్యవంతమైన రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఈ టూవీలర్‌కు 100cc ఇంజిన్ బిగించారు, ఇది 7.9 PS శక్తిని & 8.3 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ 70 kmpl నుంచి 80 kmpl మైలేజీని ఇస్తుంది. మెరుగైన సస్పెన్షన్, సౌకర్యవంతమైన సీటు & తక్కువ సర్వీస్ ఖర్చులు దీని ప్రధాన ప్లస్ పాయింట్లు. ఈ బండి ఎక్స్-షోరూమ్ ధర రూ. 70,000 కంటే తక్కువ.
టీవీఎస్ రేడియన్ 110 (TVS Radeon 110)TVS రేడియన్ 110 స్ట్రాంగ్ బాడీతో రోడ్డు మీద మంచి గ్రిప్‌తో పరుగులు తీస్తుంది. ఈ బండికి 110cc ఇంజిన్ బిగించారు, రైజింగ్ ఇస్తే కళ్లెం లేని గుర్రంలా పరుగెడుతుంది. ఈ టూవీలర్ లీటరుకు 65 km నుంచి 70 km మైలేజీ ఇవ్వగలదు. ఈ బైక్ బేస్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 60,000 కంటే తక్కువ, ఇది చాలా తక్కువ ధర & మన్నికైన ఎంపిక.
హోండా షైన్ 100 (Honda Shine 100)హోండా కంపెనీ అందించే విశ్వసనీయ నాణ్యతతో హోండా షైన్ 100 బైక్ వచ్చింది, దీనిలో 100cc ఇంజిన్ అమర్చారు. ఈ బైక్ సిటీ లేదా టౌన్ ట్రాఫిక్‌లోనూ 55 kmpl నుంచి 60 kmpl మైలేజీని సులభంగా ఇవ్వగలదు. మెరుగైన పనితీరు & తక్కువ ధర కారణంగా ఈ బండి బైక్ టాక్సీ సేవలకు సరిగ్గా సరిపోతుంది, డబ్బు తెచ్చి పెడుతుంది.
టీవీఎస్ స్పోర్ట్ 110 (TVS Sport 110)TVS స్పోర్ట్ 110 కూడా అద్భుతమైన ఇంధన సామర్థ్యం ఉన్న బైక్. ఈ బండిలో లీటరు పెట్రోలు పోస్తే 70 km వరకు ప్రయాణిస్తుంది. బైక్ టాక్సీ ప్లాట్‌ఫామ్‌లకు ఈ బైక్ బాగా సూటవుతుంది, ఆర్థిక భారం తగ్గిస్తుంది. ఈ టూవీలర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 60,000 కంటే తక్కువ. నిర్వహణ పరంగానూ ఈ బండికి చాలా తక్కువ ఖర్చవుతుంది.