KTM To Restart Bike Production: ప్రపంచవ్యాప్తంగా హై-స్పీడ్ & అడ్వెంచర్ బైక్‌లకు పేరు పొందిన ఆస్ట్రియన్ బ్రాండ్ KTM, ఇటీవలి నెలల్లో చాలా సవాళ్లను ఎదుర్కొంటోంది. అయితే, ఇప్పుడు పరిస్థితి కుదుటపడుతో్ంది. భారతీయ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ ఆర్థిక సాయంతో KTM బలోపేతం అయింది & తిరిగి రావడానికి మార్గం సుగమం చేసుకుంది. రీస్ట్రక్చర్‌ ప్లాన్‌కు కోర్టు ఆమోదం లభించడంతో, KTM జులై 2025 చివరి నాటికి ఆస్ట్రియాలో మళ్లీ ఉత్పత్తిని ప్రారంభిస్తుంది.

KTM కథ ఎలా మారింది?Pierer Mobility AG, ఆర్థిక ఇబ్బందుల కారణంగా తనను తాను 'స్వీయ పరిపాలన' (సెల్ఫ్‌ అడ్మిస్ట్రేషన్‌)లో, అంటే కోర్టు పర్యవేక్షణలోని నిర్వహణ ప్రక్రియలో పెట్టుకుంది. ఈ ప్రక్రియలో భాగంగా, కంపెనీని నిర్మాణాత్మకంగా పునరుద్ధరించడానికి ఒక ప్రణాళికను రూపొందించారు. ఇప్పుడు కోర్టు నుంచి అనుమతి పొందడంతో కంపెనీ పునఃప్రారంభించడానికి గ్రీన్ సిగ్నల్ లభించింది.        

పెద్దన్న పాత్ర పోషించిన బజాజ్ ఆటోబజాజ్ ఆటో ఇప్పటికే KTMలో వాటాదారుగా ఉంది, కానీ ఇప్పుడు KTMలో మెజారిటీ వాటా వైపు అడుగులు వేస్తోంది. బజాజ్ ఆర్థికంగా సాయం చేయడమే కాకుండా కంపెనీని సరైన దిశలో తీసుకెళ్లడానికి వ్యూహాత్మక అనుభవాన్ని కూడా అందించింది. ఇది KTMకు స్థిరత్వం & నమ్మకాన్ని ఇచ్చింది.             

"క్లిష్ట సమయాన్ని మేము దాటేశాం. ఇప్పుడు మా పూర్తి దృష్టి ఉత్పత్తిని పునఃప్రారంభించడం & కంపెనీని సరైన దిశలో తీసుకెళ్లడంపై ఉంది - KTM CEO గాట్ఫ్రైడ్ న్యూమిస్టర్               

ఏ బైక్స్‌తో రీలాంచ్‌లు స్టార్‌ కావచ్చు?KTM, తన ప్రసిద్ధ బైక్స్‌ డ్యూక్ సిరీస్ (125, 200, 250, 390), RC సిరీస్, అడ్వెంచర్ సిరీస్ & ఆఫ్-రోడ్ డర్ట్ బైక్‌ల ఉత్పత్తిని తిరిగి ప్రారంభించబోతోంది. ఇంకా.. విడిభాగాలు, ఉపకరణాలు & రైడింగ్ గేర్‌ల సరఫరా కూడా సాధారణ స్థాయికి చేరుతుంది.             

భారతదేశంలోని కస్టమర్లపై దీని ప్రభావం ఏమిటి?KTM బైక్‌లు భారతీయ యువతను బాగా ఆకర్షించాయి. ఈ బండి స్పోర్టీ డిజైన్, పవర్‌ఫుల్‌ పెర్ఫార్మెన్స్‌ & బజాజ్ డీలర్‌షిప్ నెట్‌వర్క్ కారణంగా కంపెనీకి ఇక్కడ బలమైన కస్టమర్ బేస్ లభించింది. రీలాంచ్‌ సమయంలో కస్టమర్‌లు మరింత మెరుగైన సర్వీస్, కొత్త మోడళ్లు & అప్‌గ్రేడ్ వెర్షన్‌లను పొందే అవకాశం ఉంది.              

ఇది పూర్తి స్థాయి పునరాగమనమా?KTM పునరాగమనం ప్రారంభమైనప్పటికీ, కంపెనీ పూర్తిగా బలమైన స్థితికి తిరిగి రావడానికి కొంత సమయం పట్టవచ్చు. భవిష్యత్తులో, ఈ కంపెనీ తన ప్రపంచ వ్యూహం, ఉత్పత్తి & బ్రాండ్ పొజిషనింగ్‌లో కీలక మార్పులు చేయాల్సి రావచ్చు.