Louis Vuitton autorickshaw handbag:  అసలు కన్నా కొసరే ఎక్కువ అంటారు కొందరు. ప్రపంచ ప్రసిద్ధ ఫ్యాషన్ కంపెనీలకు ఇవి బాగా వర్తిస్తాయి. వారు తయారు చేసే ఫ్యాషన్ల రేట్లు అసలు వాటిని మంచిపోతాయి. ఉదాహరణకు ఓ ఆటో రూపంలో హ్యాండ్ బ్యాక్ తయారు చేసి 35 లక్షలకు అమ్మేస్తారు. కనీ అసలు నిజమైన ఆటో మూడు లక్షలు ఉటుంది. ఆ బ్యాగ్ లో ఏమి వాడుతారు అంత కాస్ట్‌లీ అని మన లాంటి సామాన్యులు ఆశ్చర్యపోతారు. కానీ వాటిని కొనేవాళ్లు కూడా ఉంటారు.                       

Continues below advertisement



ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ లూయిస్ విట్టన్ (Louis Vuitton) తమ పురుషుల స్ప్రింగ్/సమ్మర్ 2026 కలెక్షన్‌లో భాగంగా ఆటో రిక్షా ఆకారంలో ఒక ప్రత్యేకమైన హ్యాండ్‌బ్యాగ్‌ను ప్రవేశపెట్టింది. ఇది ఇండియాలో ఉండే ఆటోల్లానే ఉంటుంది.  దీని ధర సుమారు రూ. 35 లక్షలు ($42,000). ఈ హ్యాండ్‌బ్యాగ్ భారతీయ సంస్కృతి, వీధి జీవన శైలి నుండి స్ఫూర్తి పొందినట్లు చెప్పుకున్నారు. 



ఈ బ్యాగ్‌కు మూడు చక్రాలు, హ్యాండిల్‌బార్‌లు,   పసుపు రంగు తెర  ఉన్నాయి. లూయిస్ విట్టన్   సిగ్నేచర్ గోల్డ్ మోనోగ్రామ్ ,  బ్రౌన్ లెదర్ కాన్వాస్‌తో ఈ బ్యాగ్ తయారు చేశారు.  ఇది లూయిస్ విట్టన్   పురుషుల స్ప్రింగ్/సమ్మర్ 2026 కలెక్షన్‌లో భాగం. ఈ కలెక్షన్ భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా రూపొందించారు.  ఇందులో ఏనుగు, చిరుతపులి ప్రింట్లు, మొఘల్-శైలి ఆభరణాలు, భారతీయ శైలి చెప్పులు కూడా ఉన్నాయి. ఈ ఆటో రిక్షా బ్యాగ్ ధర రూ. 35 లక్షలుగా నిర్ణయించడంతో ఒక్క సారిగా వైరల్ గా మారింది.  



ఈ బ్యాగ్ పై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఇదొక్కటే కాదు  కోల్హాపురి చెప్పులను  రూ. 1 లక్షకు పైగా  అమ్మారు.