Plea In Supreme Court To Curb Porn: 18 ఏళ్ల లోపు వారికి పోర్నోగ్రఫీ యాక్సెస్‌ను పూర్తిగా బ్లాక్ చేయాలనే పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఇటీవల  విచారణ జరిపింది. చీఫ్ జస్టిస్ బీఆర్ గవై నేతృత్వంలోని బెంచ్, ఈ అంశం ప్రభుత్వ పాలసీ డొమైన్‌లోకి వస్తుందని  వ్యాఖ్యానించింది.  పిటిషనర్ అడ్వకేట్ వరుణ్ థకూర్, కోవిడ్ తర్వాత చిన్నారులు మొబైల్‌ల ద్వారా ఒక క్లిక్‌లో పోర్న్‌కు  ఆకర్షితులు అవుతున్నారని, యూరప్, ఆస్ట్రేలియా, చైనా, అరబ్ దేశాల్లో  పూర్తిగా బ్యాన్  చేశారన్నారు. ఆ సమయంలో  CJI గవాయ్ "నేపాల్‌లో బ్యాన్ తర్వాత యూత్ ప్రొటెస్ట్‌లు జరిగాయి, ఏమైందో తెలుసా?" అని ప్రశ్నించారు. మ్యాటర్‌ను  నాలుగు వారాల తర్వాత రీ-లిస్ట్ చేయాలని బెంచ్ ఆదేశించింది.  పిటిషనర్ బీఎల్ జైన్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ )లో, ప్రతి సెకన్‌కు 5,000 పోర్న్ సైట్స్  వీక్షిస్తున్నారని గుర్తు చేశారు. ఈ ఏడాది ఇప్పటికే 2 కోట్లకు పైగా పోర్న్ వీడియోలు  అప్ లోడ్ అయ్యాయని..  భారత్‌లో 20 కోట్లకు పైగా పోర్న్ క్లిప్స్, చైల్డ్ పోర్న్ ఫ్రీగా అందుబాటులో ఉన్నాయన్నారు.  IT యాక్ట్ సెక్షన్ 69A ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ బ్లాక్ చేసే అధికారం ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి బ్యాన్ అమలు చేయలేదని పిల్‌లో పేర్కొన్నారు.

Continues below advertisement

 18 ఏళ్ల లోపు వారికి పోర్నోగ్రఫీ వీక్షణను అరికట్టే యాక్షన్ ప్లాన్ రూపొందించాలి. పబ్లిక్ ప్లేస్‌లలో పోర్నోగ్రఫిక్ మెటీరియల్ వీక్షణపై పూర్తి నిషేధం విధించేలా ఆదేశాలివ్వాలని పిటిషన్ కోరారు.  కోవిడ్ తర్వాత చిన్నారులు మొబైల్‌లు ఉపయోగిస్తున్నారు. 14-18 ఏళ్ల వయసు వారు ఒక క్లిక్‌లో పోర్న్‌కు ఆకర్షితులవుతున్నారు. ఇది మెంటల్ హెల్త్, సోషల్ ఇష్యూస్‌కు దారితీస్తోందన్నారు.  బెంచ్, ఈ అంశం ఎగ్జిక్యూటివ్ పాలసీ డొమైన్‌లోకి వస్తుందని స్పష్టం చేసింది. CJI గవాయ్, నేపాల్‌లో పోర్న్ బ్యాన్ ప్రయత్నం తర్వాత యువత ప్రొటెస్ట్‌లు జరిగి, రెండు నెలల్లో బ్యాన్ ఉపసంహరించుకున్నారని గుర్తు చేశారు. "ఇలాంటి బ్యాన్‌లు ప్రాక్టికల్‌గా అమలు చేయడం కష్టం. ప్రభుత్వం ఆలోచించాలి" అని వ్యాఖ్యానించారు.     

 ఈ ప్లీ POCSO యాక్ట్, IT రూల్స్ 2021లో చైల్డ్ పోర్న్ రెగ్యులేషన్‌కు మద్దతుగా దాఖలు చేశారు. భారత్‌లో 2024లో 1.5 కోట్లకు పైగా చైల్డ్ పోర్న్ కేసులు నమోదయ్యాయని NCRB డేటా వెల్లడిస్తోంది.  అయితే, పూర్తి బ్యాన్‌కు సాంకేతిక, ప్రైవసీ ఇష్యూస్  ఉన్నాయి.   మంత్రి అశ్విని వైష్ణవ్ "ప్లాట్‌ఫామ్‌లు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి" అని చెప్పినా, ఇప్పటివరకు ఎలాంటి జాతీయ పాలసీ రాలేదని పిటిషనర్లు అంటున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్రం త్వరలో కౌంటర్ ఫైల్ చేస్తుంది. యూరప్‌లో EU డిజిటల్ సర్వీసెస్ యాక్ట్ (DSA)లా మోడల్స్, చైనాలో గ్రేట్ ఫైర్‌వాల్ లాంటి బ్యాన్‌లు ఉన్నాయి. భారత్ లో మైనర్లు పోర్న్ చూడకుండా ఎలాంటి నిషేధం లేదు.