Security Breach in Lok Sabha:
8 మందిపై సస్పెన్షన్ వేటు..
లోక్‌సభలో భద్రతా వైఫల్య ఘటనను కేంద్ర ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణించింది. ఇప్పటికే పూర్తి స్థాయి విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలోనే లోక్‌సభ సెక్రటేరియట్ కూడా సీరియస్ అయింది. అన్ని అంచెల భద్రతను దాటుకుని ఆ ఆగంతకులు లోపలికి ఎలా వచ్చారని సిబ్బందిని ప్రశ్నించింది. ఈ మేరకు 8 మంది సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసింది.
ఈ ఘటనపై లోక్‌సభలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. ఈ దాడిని అందరూ ఖండించారని, అవసరమైన చర్యలు కచ్చితంగా తీసుకుంటామని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.
"లోక్‌సభలో జరిగిన దాడిని అందరూ ఖండించారు. మీరు (స్పీకర్‌ని ఉద్దేశిస్తూ) కూడా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారు. పార్లమెంట్‌కి లోపలికి వచ్చే వాళ్లకు పాస్‌లు జారీ చేసే విషయంలో ఇకపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటాం"
- రాజ్‌నాథ్ సింగ్, కేంద్రమంత్రి