Lok Sabha Elections Phase 6 2024 Updates: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీలోని పోలింగ్‌  బూత్‌లో మొట్టమొదట తానే వెళ్లి ఓటు వేశారు. ఆ తరవాత ఆయన ఎన్నికల సంఘం (Lok Sabha Elections 2024) నుంచి ఓ సర్టిఫికేట్‌ కూడా పొందారు. ఈ మేరకు X వేదికగా ఆయన ఓ పోస్ట్ పెట్టారు. ఈసీ ఇచ్చిన సర్టిఫికేట్‌ను చూపించారు. "ఉదయమే వచ్చి ఓటు వేశాను. రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదయ్యేలా అందరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఈ బూత్‌లో మొట్టమొదట ఓటు వేసింది నేనే" అని వెల్లడించారు. ఈ క్రమంలోనే జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడోసారి మోదీ సర్కార్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అందరూ మోదీకే ఓటు వేసి ఎన్నుకుంటారని అన్నారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకుంటారని, బీజేపీ మళ్లీ విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. 






రేఖా శర్మకి కూడా..


జాతీయ మహిళా కమిషన్ చీఫ్ రేఖా శర్మ కూడా (national commission for women) ఇదే విధంగా సర్టిఫికెట్‌ పొందారు. ఢిల్లీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొట్టమొదట ఆమే పోలింగ్‌ బూత్‌లో ఓటు వేశారు. అందరూ కచ్చితంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో ఆ సర్టిఫికేట్ ఫొటోను షేర్ చేశారు. 






జైశంకర్ ఇంకేమన్నారంటే..?


దక్షిణాదిలో బలం చాటుతూనే ఉత్తరాదిలో మునుపటి కన్నా ఎక్కువ సీట్లు సాధిస్తామని జైశంకర్ ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలపై మండి పడ్డారు. 400 సీట్ల లక్ష్యం గురించీ ప్రస్తావించారు. ఇది ఛేదించగలిగే లక్ష్యమే అని తేల్చి చెప్పారు. ఇదేదో ఊరికే పెట్టుకున్న టార్గెట్ కాదని, దీని వెనకాల చాలా లెక్కలు ఉన్నాయని వెల్లడించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ నేతల్ని వాళ్ల నియోజకవర్గాల్లో పర్యటించాలని హైకమాండ్ ఆదేశించిందని వివరించారు. అక్కడ విజయం సాధించాలంటే ఏం చేయాలన్న దానిపై ఫోకస్ పెట్టారని తెలిపారు. 


 






Also Read: PM Modi: మోదీ బస చేసిన హోటల్‌కి బిల్ ఎగ్గొట్టిన అధికారులు, లీగల్‌ యాక్షన్‌కి సిద్ధమైన యాజమాన్యం