Election Results 2024: లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. NDAపై ప్రజలు విశ్వాసం ఉంచి గెలిపించారని అన్నారు. భారత దేశ చరిత్రలోనే ఇదో అద్భుతం అంటూ స్పష్టం చేశారు. తమపై ఇంత అభిమానం చూపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు థాంక్స్ చెప్పారు. చరిత్రాత్మక తీర్పునిచ్చిన దేశ ప్రజలకు శిరసు వంచి నమస్కరిస్తున్నానని వెల్లడించారు.
"వరుసగా మూడోసారి దేశ ప్రజలు NDAని బలంగా నమ్మారు. మళ్లీ గెలిపించారు. భారత దేశ చరిత్రలోనే ఇదో అపూర్వ ఘట్టం. ప్రజలందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నాను. వాళ్లు చూపించిన అభిమానం, ప్రేమని మరిచిపోలేను. పదేళ్లుగా దేశ సంక్షేమం కోసం పని చేశాం. రానున్న రోజుల్లోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తాం"
- ప్రధాని మోదీ
ప్రస్తుత ట్రెండ్‌ని చూస్తుంటే NDA 290 మార్క్‌ని దాటేసింది. అటు ఇండీ కూటమి కూడా గట్టిగానే పోటీ ఇచ్చింది. దాదాపు 234 స్థానాల్లో దూసుకుపోయింది. 2019 లోక్‌సభ ఎన్నికల తరవాత ప్రతిపక్షాలు గట్టిగా పుంజుకోవడం ఆసక్తిని పెంచింది. NDA నిర్దేశించుకున్న 400 లక్ష్యానికి ప్రతిపక్షాలు బ్రేక్ వేశాయి.