Election Results 2024: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మళ్లీ I.N.D.I.A కూటమికే వెళ్లిపోతారా..? NDA నుంచి జంప్‌ అవుతారా..? లోక్‌సభ ఎన్నికల ఫలితాల ట్రెండ్‌ని చూస్తుంటే NDA కూటమి 300 సీట్ల లక్ష్యాన్ని దాటడమే కష్టంగా కనిపిస్తోంది. కానీ మోదీ మాత్రం 400 స్థానాల భారీ టార్గెట్ పెట్టుకున్నారు. అటు యూపీలోనూ గట్టిగానే ప్రభావం చూపిస్తోంది ఇండీ కూటమి. యోగి ఆదిత్యనాథ్ ఇలాఖాలో ప్రతిపక్ష కూటమి ఈ స్థాయిలో రాణించడం సాధారణ విషయం కాదు. ఈ క్రమంలోనే సమాజ్‌వాదీ పార్టీ నేత ఒకరు  చేసిన ట్వీట్‌ ఆసక్తికరంగా మారింది. "నితీశ్ కుమార్ మా వాడు. ఎప్పటికీ మా వాడే" అని పోస్ట్ పెట్టారు. లోక్‌సభ ఎన్నికల ముందు I.N.D.I.A కూటమిలో కీలకంగా వ్యవహరించిన నితీశ్ కూటమికి ఝలక్ ఇచ్చి NDAలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు SP నేత ట్వీట్‌తో మళ్లీ ఆయన ఇండీ కూటమిలోకి వస్తున్నారా అన్న చర్చ మొదలైంది. ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్‌ ఆయనతో సంప్రదింపులు జరుపుతోందని ABP News విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.