Election Results 2024: దక్షిణాది రాష్ట్రాలపై ఈ సారి గట్టిగా ఫోకస్ పెట్టిన బీజేపీ కర్ణాటకలో దూసుకుపోతోంది. తమిళనాడులో మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. తమిళనాట ఇండీ కూటమి ఆధిక్యంలో ఉంది. మొత్తం 28 ఎంపీ స్థానాలున్న కర్ణాటకలో 19 చోట్ల బీజేపీ లీడ్‌లో ఉండగా 8 చోట్ల కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నట్టు ఇప్పటి వరకూ ఉన్న ట్రెండ్‌ని బట్టి తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సంగతి ఎలా ఉన్నా లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో తమదే విజయం అని బీజేపీ చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పింది. ప్రస్తుత ట్రెండ్‌ని చూస్తుంటే...పార్టీ ఎక్కువ స్థానాల్లో లీడ్‌లో ఉండడం అదే సంకేతాలిచ్చినట్టవుతోంది.


.


ఇక తమిళనాడు విషయానికొస్తే...మొత్తం 39 ఎంపీ స్థానాల్లో మోదీ నేతృత్వంలోని NDA కూటమి కేవలం 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇండీ కూటమి (I.N.D.I.A) దాదాపు 20 చోట్ల లీడ్‌లో ఉంది. ద్రవిడ పార్టీల ప్రాబల్యం ఉన్న తమిళనాట NDA ఉనికి నిలుపుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నా అది సఫలం కావడం లేదు. ఈ సారి మోదీ తమిళనాడుపై ఎక్కువగా ఫోకస్ పెట్టినా అది ఓట్ల రూపంలో కలిసొస్తుందా అన్నది పూర్తి ఫలితాలు వచ్చాక తేలిపోతుంది.