PM Modi Breaking News LIVE: జపాన్ ప్రధానితో మోదీ భేటీ.. ఆ దేశం భారత్‌కు విలువైన భాగస్వామి: మోదీ
PM Modi News LIVE: ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఎప్పటికప్పుడు జరుగుతున్న అప్డేట్స్ ఈ లైవ్ బ్లాగ్‌లో చూడొచ్చు. తాజా అప్ డేట్స్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేయండి.
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ గురువారం (స్థానిక కాలమానం) జపాన్ ప్రధాని యోషిహిడే సుగాను కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. జపాన్ భారత్‌కు అత్యంత విలువైన భాగస్వామి అని కొనియాడారు. జపాన్ ప్రధానితో భేటీ బాగా జరిగిందని, ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యేలా తాము వివిధ అంశాలపై చర్చించామని మోదీ తెలిపారు.
అమెరికా- భారత్ ప్రజల మధ్య ఉన్న బలమైన సంబంధాలే మన స్నేహానికి వారధిగా నిలిచాయి. ఇందులో ప్రవాస భారతీయుల పాత్ర ఎనలేనిది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో భారత్‌కు ఆపన్నహస్తం అందించినందుకు అమెరికాకు కృతజ్ఞతలు. భారత్, అమెరికా దేశాలు సహజమైన భాగస్వాములు. ఇరు దేశాల్లోనూ ఒకే రకమైన విలువలు కనిపిస్తాయి. ఇరు దేశాల ప్రయోజనాల కోసం సమన్వయం, సహకారం పెరుగుతూనే ఉంది.
- ప్రధాని నరేంద్ర మోదీ
"కరోనా వ్యాప్తి పెరిగిన సమయంలో భారత్ అవసరానికి అమెరికా సాయం చేసినందుకు గర్వపడుతున్నాం. వ్యాక్సినేషన్లో భారత్ చూపిస్తోన్న బాధ్యత చాలా గొప్పది."
-కమలా హారిస్, అమెరికా ఉపాధ్యక్షురాలు
ప్రధాని నరేంద్ర మోదీ.. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అమెరికాకు భారత్ ఓ ముఖ్యమైన భాగస్వామ్య దేశమని కమలా హారిస్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఇరుదేశాల మధ్య ఆర్థిక, మానవ సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా మోదీ, స్కాట్ మారిసన్ మధ్య చర్చలు జరిగినట్లు పీఎంఓ ట్వీట్ చేసింది. ఇరు దేశాల మధ్య కొవిడ్, వాణిజ్య, రక్షణ రంగాలలో పరస్పర సహకారంపై ఇరు దేశాధినేతలు చర్చించారు.
Prime Minister Narendra Modi and Australian PM Scott Morrison discussed regional & global developments as well as ongoing bilateral cooperation in areas related to Covid-19, trade, defence, clean energy & more:
ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్‌తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతున్నాయి.
బ్లాక్‌స్టోన్ గ్రూప్ సీఈఓ స్టీఫెన్ స్క్వార్జ్మన్తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. భారత ప్రభుత్వం చేపడుతున్న వివిధ మౌలిక సదుపాయాలతో పెట్టుబడులు ఊపందుకుంటాయని స్టీఫెన్ స్క్వార్జ్మాన్ పేర్కొన్నారు.
జనరల్ అటామిక్స్ సీఈఓతో మోదీ సమావేశమయ్యారు. ప్రధాని మోదీతో అత్యుత్తమ సమావేశం జరిగిందని వివేక్ లాల్ ఈ సందర్భంగా అన్నారు. టెక్నాలజీ గురించి చర్చించినట్లు వెల్లడించారు.
అబోడ్ ఛైర్మన్ శంతను నారాయణ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.
క్వాల్కమ్ సీఈఓ క్రిస్టియానో ఆమోన్తో ప్రధాని నరేంద్ర మోదీ.. డిజిటల్ ఇండియా, 5జీ టెక్నాలజీపై చర్చలు జరిపినట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఆమోన్.. భారత్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తి కనబరిచినట్లు పీఎంఓ ట్వీట్ చేసింది.
గ్లోబల్ సీఈఓలతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ ప్రారంభమైంది. క్వాల్కమ్ ప్రెసిడెంట్, సీఈఓ క్రిస్టియానోతో వాషింగ్టన్ డీసీలో ప్రధాని మోదీ సమావేశమయ్యారు.
Background
అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రముఖ సంస్థల సీఈఓలతో తొలుత భేటీ కానున్నారు. ఆ తర్వాత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో సమావేశం కానున్నారు.
వాషింగ్టన్ డీసీ లో జరగబోయే ఈ భేటీకి క్వాల్కమ్, ఎబోడ్, ఫస్ట్ సోలార్, జనరల్ అటామిక్స్, బ్లేక్స్టోన్కు సంస్థల సీఈఓలతో సమావేశమవుతారు.
11 PM (IST) - ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్‌తో మోదీ భేటీ అవుతారు.
12.45 AM (IST) - అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.
3 AM (IST) - జపాన్ ప్రధాని యోషిహిదే సుగాతో ప్రధాని మోదీ చర్చలు
- - - - - - - - - Advertisement - - - - - - - - -