Layoffs In Tech Sector:


 అమెరికాలో ద్రవ్యోల్బణం..


అమెరికాలో రెసిషన్ అంతకంతకూ పెరుగుతోంది. ఈ ప్రభావం టెక్ సెక్టార్‌పై పడనుంది. ఇప్పటికే లేఆఫ్‌లు మొదలయ్యాయి. యూఎస్‌లోని LYFT,Stripe కంపెనీలు పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల పాటు కార్పొరేట్ హైరింగ్‌ను నిలిపివేయాలని అమెజాన్ నిర్ణయం తీసుకుంది. అమెరికాలో ప్రస్తుతానికి ద్రవ్యోల్బణం పెరుగుతూ పోతోంది. దీన్ని కట్టడి చేసేందుకు Federal Reserve, Central Bank of America వడ్డీ రేట్లను పెంచుకుంటూ పోతున్నాయి. ఈ నిర్ణయం కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థపై  ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఇది క్రమంగా...టెక్ కంపెనీల ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్‌ను దెబ్బ తీస్తోంది. రాబోయే రోజుల్లో తమ కంపెనీలు ఎన్నో సవాళ్లు దాటుకుని రావాల్సి ఉంటుందని ఆయా సంస్థల ఉన్నతాధికారులు చెబుతున్నారు. నిజానికి..కొవిడ్ సంక్షోభంలోనూ టెక్ సెక్టార్‌ బాగానే నెట్టుకు రాగలిగింది. ప్రాజెక్ట్‌లు పూర్తి చేయటంలో కాస్త అటు ఇటు అయినప్పటికీ...ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. ఉద్యోగావకాశాలు కూడా పెరిగాయి. దాదాపు మూడేళ్లుగా స్టేబుల్ గ్రోత్‌తో దూసుకెళ్తున్న టెక్ సెక్టార్ ఒ‍క్కసారిగా చతికిలపడింది. LYFT కంపెనీలో తమ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 13% మంది ఉద్యోగులను తొలగించనున్నారు. అంటే...సుమారు 700 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నారు. రైడ్ సర్వీస్‌లు అందించే ఈ కంపెనీ..రైడ్ షేర్ ఇన్సూరెన్స్ ఖర్చులు పెరుగుతున్నాయని చెబుతోంది. ఇక Stripe కంపెనీ...తమ సంస్థలో 14% మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది. 


ఫేస్‌బుక్‌లో లే ఆఫ్‌లు..


ఫేస్‌బుక్‌ దాదాపు 10% మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు గతంలోనే ప్రకటించింది. తమ కంపెనీ సేల్స్ డౌన్ అయ్యాయని...కాస్ట్ కట్టింగ్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని మెటా సంస్థ ప్రకటించింది. ఇక ట్విటర్‌లోనూ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ మొదలు కానుంది. ఎలన్ మస్క్ సీఈవో అయిన వెంటనే సీనియర్ ఎగ్జిక్యూటివ్స్‌ను తొలగించారు. అటు అమెజాన్ కూడా ప్రస్తుత పరిస్థితులను గమనిస్తున్నట్టు తెలిపింది. ద్రవ్యోల్బణం కారణంగా...అందరూ ఆచితూచి ఖర్చు చేస్తున్నారని తెలిపింది. 


ట్విటర్‌లోనూ..


Bloomberg ఇచ్చిన రిపోర్ట్‌ మరోసారి..ట్విటర్‌లో ఉద్యోగుల తొలగింపు విషయమై చర్చకు తెరతీసింది. బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ ప్రకారం....3,500 మందిని తొలగించేందుకు మస్క్ ప్లాన్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో ఆయా ఉద్యోగులకు మస్క్ నేరుగా మెయిల్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించే అవకాశముందని చెబుతోంది బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్. అంతే కాదు. ఇన్నాళ్లూ...ఎంప్లాయిస్ అందరూ ఎక్కడి నుంచైనా పని చేసుకునే వెసులుబాటు ఉండేది. ఇకపై ఈ ఆప్షన్‌నీ తొలగించనున్నారు మస్క్. అందరూ కచ్చితంగా ఆఫీస్‌కు వచ్చి రిపోర్ట్ చేయాలని చెబుతున్నారట. కొందరికి మాత్రమే మినహాయింపు ఉంటుందని సమాచారం. మస్క్‌ టీమ్‌లోని సలహాదారులు...ఈ జాబ్ కట్స్‌ని ఏ విధంగా 
అమలు చేయాలని స్కెచ్ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగాలు కోల్పోయే వారికి 60 రోజుల "పే" ఇచ్చి పంపాలని ఎలన్ మస్క్భా విస్తున్నట్టు సమాచారం. కాస్ట్ కట్టింగ్‌లో భాగంగానే...ఈ స్థాయిలో జాబ్ కట్స్‌ ఉంటాయన్న మాటా వినిపిస్తోంది. 


Also Read: BMC Election: మహారాష్ట్రలో ముంబయి మున్సిపల్ పాలిటిక్స్, ఆ వర్గం మా వెంటే అంటున్న ఠాక్రే