Lalit Modi takes Vanuatu citizenship: భారత్ నుంచి పారిపోయి లండన్ లో తలదాచుకుంటున్న పెద్ద మనుషుల్లో  విజయ్ మాల్యా, నిరవ్ మోదీతో పాటు లలిత్ మోదీ కూడా ఉన్నారు. లలిత్ మోడీ ఎవరో కాదు ఐపీఎల్ సృష్టికర్త. ఆయన ఆర్థిక అవకతవకలకు పాల్పడి లండన్ పారిపోయారు. మళ్లీ రాలేదు. ఎందుకైనా మంచిదని ఇప్పుడు ఆయన వనౌటు అనే దేశ పౌరసత్వం తీసుకున్నారు. భారత పౌరసత్వం వదులుకున్నారు.   


వనౌటు అనే దేశం ఉందని చాలా మందికి తెలియదు. ఎదుకంటే అది చాలా  చిన్న దేశం. పసిఫిక్ ద్వీప దేశం అయిన వనౌటూ పౌరసత్వాన్ని లలిత్ మోదీ పొందాడు. ఈ వనౌటును దేశం అనడం కన్నా ద్వీపాల సముదాయం అంటే బాగుంటుంది. మొత్తం ఎనభై ద్వీపాలు కలిపి వనౌటు.  వనౌటు పౌరసత్వం తీసుకున్న వారికి.. ఆ దేశంలో గానీ, ఇతర దేశాల నుంచి గానీ వచ్చే ఆదాయంపై ఎలాంటి ఇన్‌కమ్ ట్యాక్స్ ఉండదు. అంతేకాకుండా ఆదాయంపై వచ్చే దీర్ఘకాలిక లాభాలపైనా ఎలాంటి పన్ను విధించరు. మరీ ముఖ్యంగా స్టాక్ మార్కెట్లు, రియల్‌ ఎస్టేట్‌ వంటి వ్యాపారాలు చేసేవారికి   సిటిజెన్‌షిప్ అనేది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంటే పన్నులు లేని దేశం అన్నమాట. 
 
వనౌటు దేశంలో వారసత్వ పన్ను, కార్పొరేట్ పన్నులు ఉండవు. ఒక కంపెనీని రిజిస్టర్ చేసుకుని విదేశాల నుంచి ఆదాయాన్ని పొందినా  ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే గిఫ్ట్, ఎస్టేట్ ట్యాక్స్‌లు కూడా విధించరు. ఆ దేశం ఇప్పుడు క్రిప్టో హబ్‌గా మారింది.  2024లో విడుదలైన హ్యాపీ ప్లానెట్ ఇండెక్స్‌లో వనౌటు దేశం మొదటి స్థానంలో ఉంది. అయితే ఊరికే పౌరసత్వం ఇచ్చేయరు. కొంత విలువ ఉంటుంది. ఇటీవల అమెరికా పౌరసత్వం కోసం ట్రంప్ ప్రకటించిన గోల్డ్ కార్డ్ తరహాలో గోల్డెన్ పాస్ పోర్టు అనే విదానం వనౌటు అమలు చేస్తోంది. 


ఈ గోల్డెన్ పాస్ పోర్టు  కింద వనౌట్ లో పౌరసత్వం పందవచ్చు. ఇందు కోసం రెండు కోట్ల వరకూ  ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంగా 30 నుంచి 60 రోజుల్లో ప్రాసెస్ చేసి పౌరసత్వం, పాస్ పోర్టు ఇచ్చేస్తారు.  ఆన్ లైన్ ధరఖాస్తు చేసుకున్నా కూడా సిటిజన్ షిప్ పొందొచ్చు. దేశంలో అడుగు పెట్టకుండానే పాస్ పోర్టు లభిస్తోంది. అత్యంత వేగవంతమైన, చౌకగా పౌరసత్వం అందించే దేశాల్లో వనౌటు ఒకటి.ఈ దేశానికిప్రధాన ఆదాయం  పౌరసత్వాల ద్వారానే వస్తోంది.                            


లలిత్ మోదీ లాంటి వాళ్ల కోసమే అమెరికా ఇటీవల పౌరసత్వాల అమ్మకం పథకాన్ని ప్రకటించింది. కానీ  ట్రంప్ మరీ ఎక్కువ రేటు పెట్టారు. నలబై నుంచి యాభై కోట్ల రూపాయలు వరకూ చెల్లిస్తేనే పౌరసత్వం లభిస్తుంది. అయితే వనౌటు లాంటి దేశాలు చాలా తక్కువకే పౌరసత్వాలు ఇస్తున్నాయి.పైగా పన్నులు ఉండవు. అందుకే లలిత్ మోదీ వనౌటును ఎంపిక చేసుకున్నారని అనుకోవచ్చు.