CCMB:  CSIR-సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB) ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో సేమ్ క్యాస్ట్ మ్యారేజెస్ వల్ల జెనెటిక్ సమస్యలు వస్తున్నట్లుగా గుర్తించారు. భారతదేశ వివాహాల్లో కులం అనేది మొదటి ప్రయారిటీ. ఎవరైనా తమ కులంలో అమ్మాయి లేదా అబ్బాయినే  ఇంటికి కోడలిగా లేదా అల్లుడిగా తెచ్చుకోవాలనుకుంటారు. కులాంతర వివాహాలకు ఇంకా పూర్తి స్థాయిలో జనామోదం రాలేదు. కానీ ఇలా ఒకే కులంలోవివాహాల వల్ల  కొన్ని వర్గాల్లో  తరాతరాల్లో జన్యపరమైన సమస్యల వృద్ధికి కారణం అవుతున్నాయని గుర్తించారు. 

 ఒకే కులం వ్యక్తుల్నిపెళ్లి చేసుకుంటున్న వర్గాల జనాభాలో వంశపారంపర్య వ్యాధుల రేటు ఎక్కువగా ఉందని సంవత్సరాల పరిశోధన హైదరాబాద్‌కు చెందిన CSIR-సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB) ఇటీవల చేసిన అధ్యయనం లో తేలింది.  ఆంధ్రప్రదేశ్,  తెలంగాణలోని రెడ్డి సమాజాలలో ఆంకైలోజింగ్ స్పాండిలైటిస్ (AS) అనేది జన్యుపరమైన సమస్యగా మారిందని  సౌత్ ఫస్ట్ సంస్థ విశ్లేషించింది.  ఆంకైలోజింగ్ స్పాండిలైటిస్ అనేది దీర్ఘకాలిక  ఆర్థరైటిస్ లాంటిది.  ఇది ప్రధానంగా వెన్నెముకను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల తీవ్రమైన వెన్నునొప్పికి కారణం అవుతోంది.  రోగనిరోధక వ్యవస్థ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తున్న HLA-B27 జన్యువుకు సంబంధించిన అంమం. అయితే ఒకే కులంలోపెళ్లి చేసుకుంటున్న వారిలో ఈ సమస్య పెరుగుతోంది. 

సౌత్ ఫస్ట్ కథనం ప్రకారం దక్షిణ భారత జనాభాలోని నాలుగు ప్రధాన వర్గాలు కళింగ, కల్లార్, రెడ్డి , యాదవ్ ల నుం నుండి 281 మంది వ్యక్తుల జన్యవులను విశ్లేషించారు.  ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే కొత్త జన్యు వైవిధ్యాలను గుర్తించారు. జన్యువులు మందులకు ప్రతిస్పందనలను ఎలా ప్రభావితం చేస్తాయో కూడా వారు అధ్యయనం చేశారు, అదే ఔషధం కొంతమందికి ఎందుకు బాగా పనిచేస్తుందో కానీ ఇతరులకు ఎందుకు పని  చేయలేదో విశఅలేషించారు. వేర్వేరు జనాభాలో వేర్వేరు మందులు భిన్నంగా ఎందుకు పనిచేస్తాయో అర్థం చేసుకోవడానికి ఔషధ జీవక్రియను ప్రభావితం చేసే ఫార్మకోజెనోమిక్ మార్కర్‌లను కూడా మేము పరిసీలించినట్లుగా పరిశోధకులు చెబుతున్నారు. 

రెడ్డి జనాభాలో 13 శాతం మంది వ్యక్తులు ఆంకైలోజింగ్ స్పాండిలైటిస్ (AS) కలిగి ఉన్నారు. ఇది సాధారణ జనాభాలో కనిపించే దానికంటే చాలా ఎక్కువ .  రెడ్డి సమాజంలో ఒకే సమూహంలో తరాల తరబడి వివాహం చేసుకోవడం వల్ల ఇలాంటివి పెరిగాయని గుర్తించారు.  కుటుంబాలు తమ సొంత సంఘంలో వివాహం చేసుకున్నప్పుడు ఇది తరచుగా సంక్రమించే కుటుంబ వారసత్వం లాగానే  AS సోకే అవకాశాన్నికల్పిస్తోందని చెబుతున్నారు.  

హైదరాబాద్‌లోని KIMS ఆసుపత్రిలో మొత్తం 2,963 AS-పాజిటివ్ కేసులలో రెడ్డి జనాభా నుండి సుమారు 140 AS రోగులు ఉన్నారు. ఇది ఇతరుల్లో అంత ఎక్కువగా లేదు.  ఆంధ్రప్రదేశ్‌లోని ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో నివసించే రెడ్డి సమాజంలో ఆంకైలోజింగ్ స్పాండిలైటిస్ ఎక్కువగా ఉన్నట్లు కిమ్స్ వైద్యులు గుర్తించినట్లుగా సౌత్ ఫస్ట్ తెలిపింది. ఎలాచూసినా  ఒకే కులంలో వివాహాలు అనేక అనారోగ్య సమస్యలకు కారణం అవుతాయని సీసీఎంబీ చెప్పినట్లే. కులాంతర వివాహాలే మంచివని వైద్య నివేదికలు వెల్లడిస్తున్నాయి.