Kharge on Modi Govt: 'పార్లమెంటులో చైనాకు వ్యతిరేకంగా మాట్లాడకూడదా?'- మోదీకి ఖర్గే ప్రశ్న

ABP Desam Updated at: 15 Dec 2022 01:24 PM (IST)
Edited By: Murali Krishna

Kharge on Modi Govt: భారత్- చైనా సైనికుల మధ్య తాజాగా జరిగిన ఘర్షణపై పార్లమెంటులో చర్చించేందుకు మోదీ సర్కార్ ఎందుకు భయపడుతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నిలదీశారు.

'పార్లమెంటులో చైనాకు వ్యతిరేకంగా మాట్లాడకూడదా?'- మోదీకి ఖర్గే ప్రశ్న

NEXT PREV

Kharge on Modi Govt: అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్ సమీపంలో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే.. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్రంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.







మోదీ ప్రభుత్వం తమ ఎర్రటి కళ్లను చైనా కళ్లద్దాలతో కప్పుకున్నట్లు అనిపిస్తోంది. భారత పార్లమెంటులో చైనాకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు అనుమతి లేదా?                                     -   మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు


ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చకు డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాలు గత రెండు రోజులుగా సభ నుంచి వాకౌట్‌ చేస్తున్నాయి. సున్నితమైన భారత్-చైనా సరిహద్దు సమస్యపై చర్చకు ప్రభుత్వం అనుమతించడం లేదని ఆరోపిస్తూ సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీలు, తృణమూల్ కాంగ్రెస్ శాసనసభ్యులు బుధవారం సభ నుంచి వాకౌట్ చేశారు.


డిమాండ్


ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన వెంటనే 'ఇండో-చైనా సరిహద్దు పరిస్థితి'పై చర్చ జరగాలని కాంగ్రెస్ సభా నాయకుడు అధిర్ రంజన్ చౌదరి డిమాండ్ చేశారు. 1962లో చైనా యుద్ధం సమయంలో దివంగత ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ లోక్‌సభలో చర్చకు అనుమతించారని గుర్తు చేశారు.



మేము భారత్-చైనా సరిహద్దు పరిస్థితులపై చర్చకు డిమాండ్ చేస్తున్నాం. 1962లో భారత్- చైనా యుద్ధం సమయంలో, జవహర్‌లాల్ నెహ్రూ ఈ సభలో 165 మంది ఎంపీలకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాతే ఏమి చేయాలనే దానిపై నిర్ణయం తీసుకున్నారు.                   - అధీర్ రంజన్ చౌదరి, లోక్‌సభలో కాంగ్రెస్ సభా పక్ష నేత 


కాంగ్రెస్ నేత డిమాండ్‌పై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ.. బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.


ఇదీ జరిగింది 


డిసెంబర్ 9న అరుణాచల్‌ ప్రదేశ్‌ తవాంగ్‌ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ వద్దకు చైనా సైనికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. పీఎల్‌ఏ సేనలు తమ సరిహద్దు దాటి భారత భూభాగంలో పెట్రోలింగ్‌కు వచ్చిన సమయంలో ఈ ఘర్షణ జరిగింది. యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నించిన.. చైనా జవాన్లను మన దళాలు సమర్థంగా అడ్డుకున్నాయి. మన భూభాగంలోకి చొరబడకుండా చైనా సైనికులను.. భారత దళాలు ధైర్యంగా నిలువరించి వారిని తిరిగి తమ స్థానానికి వెళ్లేలా చేశాయి. 


ఘర్షణ జరిగిన సమయంలో సుమారు 600 మంది పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ దళ సభ్యులు అక్కడున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భారత్‌కు చెందిన కనీసం మూడు వేర్వేరు యూనిట్లు ఘర్షణ స్థలంలో ఉన్నట్లు సమాచారం.  మరోవైపు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ఈ ఘటనపై లోక్‌సభలో ప్రకటన చేశారు.


Also Read: FIFA World Cup 2022: బీభత్సం సృష్టించిన మొరాకో ఫ్యాన్స్- ఓటమిని తట్టుకోలేక!

Published at: 15 Dec 2022 01:11 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.