Khalistani Terrorists  Fire At Kapil Sharma Cafe In Canada: కామెడి కింగ్ కపిల్ శర్మ కెనడాలో కొత్తగా ప్రారంభించిన   కాప్స్ కేఫ్  రెస్టారెంట్‌పై  ఖలీస్థానీ తీవ్రవాదులు దాడి చేశారు. కాల్పులతో బీభత్సం సృష్టించారు. అయితే   ఈ దాడిలో ఎవరూ గాయపడలేదు.  కానీ ఈ సంఘటన స్థానిక భారతీయ సమాజంలో ఆందోళన కలిగించింది. కెనడాలో పెరుగుతున్న ఖలిస్థానీ తీవ్రవాదుల అరాచకాల్ని గుర్తు చేసింది. 

కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో    కాప్స్ కేఫ్‌ పేరుతో కపిల్ శర్మ కొత్తవ్యాపారం ప్రారంభించారు.అర్థరాత్రి పూట కస్టమర్లు ఎవరూ లేని సమయంలో  తొమ్మిది రౌండ్ల బుల్లెట్లు కేఫ్‌పై కి దూసుకు వచ్చాయి.  కొన్ని బుల్లెట్లు కేఫ్‌తో పాటు ఇతర  నివాస భవనాలకు కూడా తగిలాయి. సీసీటీవీ ఫుటేజ్‌లో ఈ కాల్పుల దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ కాల్పుల ఘటన వీడియో వైరల్ అయింది. 

ఈ దాడికి బాబర్ ఖల్సా ఇంటర్నేషనల్ (BKI) ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న హర్జీత్ సింగ్ లడ్డీ బాధ్యత వహించినట్లు ప్రకటించుకున్నాడు.  పేర్కొన్నాడు. లడ్డీ భారతదేశంలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)   మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో ఉన్నాడు. కపిల్ శర్మ చేసిన కొన్ని వ్యాఖ్యలపై ఆగ్రహంతో ఈ కాల్పులు జరిపినట్లుగా లడ్డీ ప్రకటించుకున్నాయి. అయితే  కపిల్ శ్రమ చేసిన ఆ వ్యాఖ్యలేమిటో లడ్డీ చెప్పలేదు.  

కపిల్ శర్మ , తన భార్య గిన్నీ చత్రత్ సంయుక్తంగా ఈ కేఫ్‌ను సర్రేలో ఈ నెలలోనే సాఫ్ట్ లాంచ్ చేశారు.  రెస్టారెంట్ రంగంలో కపిల్ శర్మ తొలి వ్యాపార ప్రయత్నం. కెనడాలో గణనీయంగా ఉన్న భారతీయుల్ని ఆకట్టుకునేలా కేఫ్ ఉంటుంది. కపిల్ శ్రమ భార్య నేరుగా  రెస్టారెంట్ నిర్వహణలో పాలుపంచుకుంటున్నారు.  

 కాల్పుల ఘటనపై సర్రే పోలీసు డిపార్ట్‌మెంట్ ఈ ఘటనను దర్యాప్తు చేస్తోంది. ఘటనా స్థలాన్ని సీల్ చేసి, సీసీటీవీ ఫుటేజ్ ,ఇతర ఆధారాలను సేకరిస్తోంది. ఈ దాడికి ముందు కపిల్ శర్మ కుటుంబానికి  బెదిరింపులు  వచ్చాయా..డబ్బులుఏమైనా డిమాండ్ చేశారా అన్న అంశాన్ని కూడా పోలీసులుఆరా తీస్తున్నారు.