గోల్డ్ స్మగ్లింగ్ కేసులు తరచుగా మనం వింటూనే ఉంటాం. అయితే ఈ బంగారం అక్రమ తరలింపులో చాలా మంది వినూత్నంగా ఆలోచిస్తుంటారు. ఎంత కొత్తగా స్కెచ్ వేసినా దొరికిపోతూ ఉంటారు. ఈ రోజు కేరళ కాన్నూర్ విమానాశ్రయంలో 302 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు భద్రతా సిబ్బంది. ఈ బంగారం తరలింపు కోసం వాళ్లు వేసిన స్కెచ్ చూసి భద్రతా సిబ్బందికే మైండ్ బ్లాక్ అయింది.


ఏం చేశారు?


కేరళ కాన్నూర్ విమానాశ్రయంలో ప్యాంట్ లోపల బంగారాన్ని పూత పూసి దానిపై పెయింట్ స్ప్రే చేసి తెలివిగా తప్పించుకుందామనుకున్నాడు ఓ పాసింజర్. అయితే భద్రతా సిబ్బంది ఎలా పట్టుకున్నారో ఏమో కాని ఆ పాసింజర్ దొరికిపోయాడు. ప్యాంట్ తీసి కట్ చేసి చూసిన సిబ్బంది షాక్ అయ్యారు. 


ఇంతకుముందు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఎక్కువగా అరబ్ దేశాల నుంచి బంగారాన్ని ఇండియాకు తీసుకువస్తుంటారు. ఎక్కువగా కేరళ విమానాశ్రయాల్లోనే గోల్డ్ స్మగ్లింగ్ కేసులు ఎక్కువగా వస్తుంటాయి.


ట్విట్టర్ లో..


బంగారాన్ని ఇలా కూడా తరలించొచ్చా అని ఈ ఫొటోలు చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.