MLA: తీవ్ర విషాదం - పద్దెనిమిది అడుగుల ఎత్తు నుంచి పడిన మహిళా ఎమ్మెల్యే - కోమాలోకి !

Kerala : భరతనాట్యం రికార్డు ప్రదర్శనను ఏర్పాటు చేసి ఎమ్మెల్యేను పిలిచారు నిర్వాహకులు. కానీ ఎత్తైన స్టేజ్ ఏర్పాటు చేసి సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో అక్కడ్నుంచి పడి కోమాలోకి వెళ్లిపోయారు

Continues below advertisement

Kerala Congress MLA Uma Thomas in ICU after falling 18 ft: కేరళలోని కోచిలో అతి పెద్ద భరత నాట్యం ప్రదర్శనలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే ఉమా ధామస్ స్టేజ్ పై నుంచి పడిపోయారు. దీంతో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. కోమాలోకి వెళ్లిపోయారు. ఆమె పరిస్థితి స్టేబుల్ గా ఉన్నా ఇంకా కోమాలోనే ఉన్నారని వైద్యులు ప్రకటించారు. 

Continues below advertisement

అసలేం జరిగిందంటే ?

కొచ్చిలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో పన్నెండు వేల మందికిపైగా భరతనాట్యం డాన్సర్లతో నిర్వాహకులు ఓ భారీ కార్యక్రమం చేపట్టారు. రికార్డు చేపట్టాలన్న లక్ష్ష్యంతో  దీన్ని ఏర్పాటు చేశారు. పన్నెండు వేల మంది డాన్సర్లు కావడంతో అతి పెద్ద వేదిక నిర్మించారు. ముఖ్య అతిధిగా కేరళ సాంస్కృతిక మంత్రిని ఆహ్వానించారు. ఎమ్మెల్యేలను, ఎంపీలను ఆహ్వానించారు. ఉమా థామస్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పద్దెనిమిది అడుగుల ఎత్తులో ముఖ్యులంతదరికీ సీట్లు ఏర్పాటు చేశారు. డాన్సర్ల ప్రదర్శన కనిపించాలంటే ఆ మాత్రం ఎత్తులో ఉండాలని అనుకున్నారు.                       

Also Read: భారతీయుల్ని రానివ్వకపోతే టెక్నికల్‌గా దివాలా తీస్తాం - ట్రంప్‌ను హెచ్చరిస్తున్న మస్క్, రామస్వామి !

అయితే ఆ స్టేజి అంచున సరైన జాగ్రత్తలు తీసుకోలేదు. పలువురు వీఐపీలకు అంచున సీట్లు వేశారు. ఇలా ఉమాధామస్ కూర్చున్న చోట ఒరిగిపోయింది.  దీంతో ఆమె వెనక్కి పడిపోయారు.  పద్దెనిమిది అడుగుల ఎత్తు నుంచి ఆమె ఒక్క సారిగా పడిపోయారు. అక్కడ వేదిక నిర్మాణం కోసం పెట్టిన కర్రలు ఉండటంతో వాటి మీద పడిపోయారు. నేరుగా తలకు దెబ్బతగిలింది. షాక్ కు గురైన నిర్వాహకులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె కోమాలోకి వెళ్లిపోయారు.                   

వైద్యులు వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. అంత ఎత్తు నుంచి పడటం వల్ బ్రెయిన్ తో పాటు శరీరంలో పలు చోట్ల బ్లెడ్ క్లాట్ అయిందని వైద్యులు చెప్పారు. కొద్ది కొద్దిగా ఆమె పరిస్థితి మెరుగు అవుతున్నప్పటికీ కోమాలోనే ఉన్నారని వైద్యులు ప్రకటించారు. సరైన ఏర్పాట్లు చేయని భరత నాట్యం ప్రదర్శన నిర్వాహకులపై పోలీసులు కేసులు పెట్టారు. ఈ ఘటన కేరళలో సంచలనం సృష్టించింది. 

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉమా ధామస్   ప్రజాసేవలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇలా ఒక్క సారిగా ఆమె కోమాలోకి వెళ్లిపోవడతో కేరళ రాజకీయవర్గాలు షాక్‌కు గురయ్యాయి.                                             

Also Read : Pakistan Afghanistan War: తాలిబన్ల చేతిలో చావు దెబ్బ తింటున్న పాకిస్తాన్ - భారత్ పని సులువైనట్లే !

 
Continues below advertisement
Sponsored Links by Taboola