Man Marries Triplets: ఒకరు, ఇద్దరూ కాదు ఓ కెన్యా వ్యక్తి ఏకంగా ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు. కేట్, ఈవ్, మేరీ కెన్యాలో నివసిస్తున్నారు. వారు ముగ్గురు ట్రిప్లెట్స్. ముగ్గురూ చూడటానికి ఒకే రకంగా ఉంటారు. కట్టూ బొట్టూ ఒకే రకంగా ఉంటుంది. హెయిర్ స్టైల్ కూడా ఒకేలా ఉండేలా చూసుకునేవారు. ముగ్గురు అక్కాచెల్లెళ్లు చూడముచ్చటగా ఉన్నారని అంతా అనుకునే వారు కానీ పెరిగి పెద్దయ్యాక ముగ్గురు ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకుంటారని ఎవరూ అనుకోలేదు. కానీ ఎవరూ ఊహించనట్లుగా ముగ్గురూ కలిసి ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతోపాటు ఏ వారంలో అతడు ఎవరి దగ్గర ఉండాలో కూడా పక్కాగా చార్టు వేసుకుని దానిని పాటిస్తున్నారు.


కెన్యాలో స్టీవో అనే వ్యక్తిని ముగ్గురు అక్కాచెల్లెళ్లలో ఒకరైన కేట్ కలుసుకుంది. అతనితో మాట కలిపింది. తర్వాత స్టీవోను తన ఇద్దరు సోదరీమణులకు పరిచయం చేసింది. స్టీవోకు ముగ్గురు అక్కాచెల్లెళ్లు నచ్చడం మొదలైంది. అలాగే ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లు కూడా స్టీవోను ఇష్టపడ్డారు. ఒకే రూపం మాత్రమే కాదు ముగ్గురిది ఒకేలాంటి వ్యక్తిత్వం కావడంతో వారితో కలిసి జీవితాన్ని పంచుకోవడం కష్టం కాదని స్టీవో భావించాడు. ముగ్గురిని స్వీకరించాలని నిర్ణయం తీసుకున్నాడు.


కొన్నిరోజులు రిలేషన్ షిప్ లో ఉన్న తర్వాతే పెళ్లి:


ముగ్గురిని పెళ్లి చేసుకుని నలుగురం కలిసి ఉండాలన్న స్టీవో నిర్ణయం అల్లాటప్పాగా ఏమీ తీసుకోలేదు. ముందుగా వారితో సహజీవనం చేశాడు. వారితో కొన్ని నెలల పాటు రిలేషన్ షిప్ లో ఉన్నాడు. ముగ్గురు అక్కాచెల్లెళ్లతో గడిపాడు. వారిని పెళ్లి చేసుకుంటే ఎలా కలిసి ఉంటారో అచ్చంగా అలాగే ఉన్నారు. అలా ఉన్నన్ని రోజులు వారి మధ్య ఎలాంటి పొరపచ్చాలు రాలేదు. చిన్న పాటి గొడవలు లేవు. చాలా ప్రశాంతంగా, సాఫీగా సాగిపోయాయి ఆ రోజులు. ట్రిప్లెట్స్ అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకోవడం, నలుగురు కలిసి ఉండటంలో ఎలాంటి సమస్య లేదని పూర్తిగా విశ్వసించిన తర్వాతే వివాహం చేసుకున్నాడు స్టీవో. 


చార్టు వేసుకున్నారు దానిని పాటిస్తున్నారు..


ముగ్గురు సోదరీమణులు ఎలా ఉండాలో ఒక ప్రణాళిక వేసుకున్నారు. దాని ప్రకారం స్టీవో ఎప్పుడు ఎవరితో ఉండాలో నిర్ణయించుకున్నారు. ఒకేసారి ముగ్గురు భార్యలతో జీవించేందుకు తనకు ఎలాంటి సమస్య లేదని స్టీవో చెప్పారు. ముగ్గురినీ తాను సంతోషంగా ఉంచగలనని ధీమాగా ఉన్నాడు. మేరీతో సోమవారం, కేట్ తో మంగళవారం, బుధవారం ఈవ్ తో ఉంటున్నాడు స్టీవో. మిగతా రోజుల్లో నలుగురు కలిసి మెలిసి ఉంటున్నారు.


ఇక్కడ అలా, కానీ అక్కడ ఇలా కాదు..


భారత్ లో బహుభార్యత్వం తప్పు. చట్టరీత్యా అది నేరం కూడా. అయితే ఇస్లాం ప్రకారం బహుభార్యత్వం తప్పు కాదు. కానీ చాలా మంది ఒకరిని మాత్రమే పెళ్లి చేసుకుంటారు. చాలా కొద్ది మంది మాత్రమే రెండు వివాహాలు చేసుకుంటారు. అయితే విదేశాల్లో అలా కాదు. ఒకటి కంటే ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండటం అక్కడ చాలా సాధారణం. అయితే ఇప్పుడు కెన్యాలో జరిగినట్లుగా ఒక వ్యక్తి ఒకేలా ఉండే ముగ్గురు అక్కాచెల్లెళ్లను పెళ్లిళ్లు చేసుకోవడం మాత్రం విచిత్రం.