Breaking News Telugu Live Updates: జువైనల్ హోమ్ నుంచి ఉస్మానియా ఆసుపత్రికి మైనర్ నిందితులు

AP Telangana Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP Desam Last Updated: 11 Jun 2022 02:09 PM

Background

నైరుతి రుతుపవనాలు గత ఏడాది కంటే ముందే కేరళను తాకాయి. కానీ ఉపరితల ఆవర్తనం, పశ్చిమ దిశ నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో రుతుపవనాల గమనం మందగించడంతో ఏపీలోకి ఆలస్యంగా ప్రవేశించాయి. నైరుతి రుతుపవనాలు ఏపీలోని రాయలసీమలోకి ప్రవేశించాయని ఏపీ వెదర్...More

జర్నలిస్టు పై దాడిని ఖండించిన పెద్దపెల్లి జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు

పెద్దపల్లి జిల్లా... గోదావరిఖనిలో జర్నలిస్టు పై దాడిని ఖండించిన పెద్దపెల్లి జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్.
దాడికి పాల్పడ్డ కార్పోరేటర్ ను మరో ముగ్గురు ని టిఆర్ఎస్  పార్టీ నుంచి బహిష్కరించినట్టు ప్రకటన.
ఇక నుంచి పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడిన, ప్రజా జీవనాన్ని భంగం కలిగించేలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కార్యకర్తలను హెచ్చరించిన టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చందర్.