మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాత్రి ఫామ్‌హౌస్‌లో కాలు జారి పడ్డారు. రాత్రి రెండున్నర గంటల సమయంలో బాత్‌రూమ్‌లో కాలు జారి పడ్డారు. కిందపడ్డ ఆయనకు కాలికి గాయమైంది. వెంటనే హుటాహుటిన ఆయన్ని యశోద ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన కట్టుకున్న లుంగీ కాళ్లకింద పడటం వల్లే జారి పడ్డారు. దీని కారణంగా తుంటి ఎముకకు గాయమైంది.
కేసీఆర్‌కి అయిన గాయంపై యశోద ఆసుపత్రి వర్గాలు స్పందించాయి. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రమాదం ఏమీ లేదని చెబుతున్నారు. ఆయనకు హిప్ రీప్లేస్‌మెంట్ చేయాలని తెలిపారు. సాయంత్రం హిప్‌రీప్లేస్‌మెంట్ సర్జరీ ఉంటుందని అంటున్నారు.
ఆసుపత్రిలో చేరిన కేసీఆర్‌ను బీఆర్‌ఎస్ కీలక నేతలంతా పరామర్శిస్తున్నారు. ఆసుపత్రికి చేరుకొని ఆయన ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. కేసీఆర్ ఆరోగ్యంపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత...కేసీఆర్ క్షేమంగా ఉన్నారని తెలిపారు. ప్రజాభిమానంతో మళ్లీ ఆయన ఆరోగ్యంతో తిరిగి వస్తారని ట్విటర్‌లో వెల్లడించారు.
కేసీఆర్ ఆరోగ్యంపై ప్రధానమంత్రి మోదీ ట్వీట్ చేశారు. ఆయన ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకున్నారు. ఎక్స్ వేదికగా కేసీఆర్ స్పందించిన మోదీ... తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి గాయమైందని తెలిసి బాధపడ్డాను. త్వరగా ఆయన కోలుకొని,మంచి ఆరోగ్యం పొందాలని నేను ప్రార్థిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.