Karnataka student committed suicid : చదువుల ఒత్తిడి, ఇష్టం లేని కోర్సులో జాయిన్ చేయడం, మిగిలిపోయిన బ్యాగ్ లాగ్స్ వంటి ఒత్తిడితో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న అంశం కర్ణాటకలో కలకలం రేపుతోంది. కర్ణాటకలోని కొడుగుజిల్లాలోని పొన్నంపేట్‌లోని హల్లిగట్టు సీఈటీ కళాశాలలో హాస్టల్‌లో ఉంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ (ఏఐఎంఎల్) మొదటి సంవత్సరం చదువుతున్న రాయచూర్‌కు చెందిన 19 ఏళ్ల విద్యార్థిని తేజస్విని ఆత్మహత్య చేసుకుంది. తేజస్విని సూసైడ్ లెటర్‌ను కొడగు పోలీసులకు లభించింది. సూసైడ్ నోట్‌లో ఆరు బ్యాక్‌లాగ్‌ల కారణంగా ,చదువు కొనసాగించాలనే ఇష్టం లేకపోవడం వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నట్లు రాసింది. తేజస్విని రాయచూర్‌కు చెందిన మహంతప్ప అనే వ్యక్తి ఏకైక కుమార్తె. ఆమె మూడు రోజుల క్రితమే తన పుట్టినరోజు జరుపుకుంది.
తల్లిదండ్రులు తమకు ఇష్టమైన చదువులు చదవాలని పిల్లలపై ఒత్తిడి తీసుకు వస్తూ.. వారికి ఆసక్తి లేని కోర్సుల్లో చేర్పించడం వల్ల వారు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారని బలవంతంగా ప్రాణాలు తీసుకునేందుకు సైతం వెనుకాడటం లేదని మానసిక నిపుణులు చెబుతున్నారు. దీనికి తగ్గట్లుగానే పలు చోట్ల చదవుల ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఈ అంశంపై విద్యార్థుల విషయంలో తల్లిదండ్రులు వ్యవహరించాల్సిన విధానంపై అనేక మంది నిపుణులు సలహాలు ఇస్తూనే ఉన్నారు.
ఇటీవల తెలుగు ఓటీటీలో అనగనగా అనే సినిమా వచ్చి హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో ఇద్దరు టీచర్లుగా పని చేసి తల్లిదండ్రుల కుమారుడు చదువుల్లో వెనుకబడిపోతే ... ఇద్దరు టీచర్ల దృక్పథం వేరు అయినప్పుడు.. పిల్లలకు ఏది మంచిది అనేది అత్యంత కీలకమైన విషయంగా చర్చించారు. విద్యార్థులను ఒత్తిడికి గురి చేయడం ద్వారా.. వారి సమస్యలను పెంచడమే తప్ప తగ్గించినట్లుగా ఉండదని.. వారికి ఇష్టమైన చదువులు, ఇష్టమైన పద్దతుల్లో చదువుకునే అవకాశం కల్పిచాలన్న సూచనలు విద్యావేత్తలు చేస్తున్నారు.
రాజస్తాన్ లోని కోటలోనూ ఐఐటీ కోచింగ్ కు వచ్చిన విద్యార్థులు పెద్ద ఎత్తున ప్రాణాలు తీసుకుంటున్నారు. అక్కడ కోచింగ్ సెంటర్లలో చేర్పించడానికి దేశం నలుమూలల నుంచి తల్లిదండ్రులు వస్తారు. అక్కడ హాస్టళ్లలో చేర్పించి వెళ్తారు. వారికి ఇష్టం ఉన్నా లేకపోయినాతీవ్ర ఒత్తిడి మధ్య వారు చదువుకోవాల్సి వస్తుంది. ఈ కారణంగా కోటాలో కూడా ఆత్మహత్యలు పెరిగిపోయాయి. ఇప్పుడు అక్కడ కోచింగ్ సెంటర్ల వ్యాపారం తగ్గిపోతోంది.