Karnataka CM Race: 


ట్విటర్‌లో ఫోటో..


కర్ణాటక సీఎం రేసుకి తెరపడింది. సీఎంగా సిద్దరామయ్యను ప్రకటించింది హైకమాండ్. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ అధికారికంగా ఈ ప్రకటన చేశారు. డీకే శివకుమార్‌కి డిప్యుటీ సీఎం పదవి కట్టబెట్టారు. సీఎం కుర్చీలో కూర్చోవాలని ఆశపడ్డ ఆయనను డిప్యుటీకి పరిమితం చేసిం అధిష్ఠానం. అయితే...ఈ నిర్ణయంపై తొలిసారి డీకే స్పందించారు. తాము అంతా కలిసే ఉన్నామని, కర్ణాటక ప్రజల సంక్షేమమే తమ ప్రాధాన్యత అని తేల్చి చెప్పారు. సిద్దరామయ్య, ఖర్గేతో కలిసి దిగిన ఫోటోని ట్విటర్‌లో పంచుకున్నారు. 


"కర్ణాటక ప్రజల భవిష్యత్‌కి భరోసా ఇవ్వడం, వాళ్ల సంక్షేమానికి కట్టుబడి ఉండటం..ప్రస్తుతానికి ఇవే మా ప్రాధాన్యత. ఈ విషయంలో మేము కలిసికట్టుగా పని చేస్తామని హామీ ఇస్తున్నాను"


- డీకే శివకుమార్, కర్ణాటక డిప్యుటీ సీఎం