Karnataka Govt Formation: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య, డిప్యూటీ సీఎంగా శివకుమార్

Karnataka Govt Formation: కర్ణాటక ముఖ్యమంత్రిగా దాదాపు సిద్దరామయ్య పేరు ఖరారైనట్టు సమాచారం.

ABP Desam Last Updated: 18 May 2023 07:19 AM
కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య, డిప్యూటీ సీఎంగా శివకుమార్

కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసినట్టు ఏఎన్‌ఐ న్యూస్‌ ఏజెన్సీ తెలిపింది. డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేయనున్నారని సమాచారం.  కర్ణాటక ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఏకాభిప్రాయానికి వచ్చారని పేర్కొంది. మే 20న బెంగళూరులో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుందని తెలుస్తోంది. 

రాహుల్‌తో భేటీ

సీఎం రేసులో ఉన్న డీకే శివకుమార్, సిద్దరామయ్య రాహుల్ గాంధీని కలిశారు. సీఎం పేరు ఖరారైందన్న వార్తల నేపథ్యంలో ఇలా సమావేశమవడం ఆసక్తికరంగా మారింది. 





48 గంటల్లో కొత్త కేబినెట్!

మరో 48-72 గంటల్లో కర్ణాటకలో కొత్త కేబినెట్ ఏర్పాటవుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా వెల్లడించారు. 

డీకేకి ఆరు శాఖలు?

డీకే శివకుమార్‌కి డిప్యుటీ సీఎంతో పాటు మొత్తం 6 శాఖలు ఇస్తామని రాహుల్ హామీ ఇచ్చారని, కానీ శివకుమార్ అందుకు అంగీకరించలేదని తెలుస్తోంది. 

బెంగళూరులో ఏర్పాట్లు

బెంగళూరులో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

ఖర్గే ఇంటికి డీకే

రాహుల్ గాంధీతో భేటీ ముగిసిన తరవాత డీకే శివకుమార్ మరోసారి ఖర్గే నివాసానికి వెళ్లారు. 

శివకుమార్‌తో సోనియా భేటీ!

సీఎం రేసులో ఉన్న డీకే శివకుమార్‌తో సోనియా గాంధీ ప్రత్యేకంగా మాట్లాడినట్టు సమాచారం. పార్టీకి విధేయుడిగా ఉంటున్న ఆయనకు హైకమాండ్‌ కచ్చితంగా తగిన గౌరవమిస్తుందని చెప్పినట్టు తెలుస్తోంది. 

విభేదాల్లేవు అంటున్న కాంగ్రెస్ నేతలు

సీఎం పదవిని ఎవరికివ్వాలనే క్లారిటీ హైకమాండ్‌కి ఉందని, అధిష్ఠానం నిర్ణయాన్ని కట్టుబడి ఉంటామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. 

సిద్దరామయ్యకు ఎమ్మెల్యేల సపోర్ట్

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం..సిద్దరామయ్యకు 75 మంది ఎమ్మెల్యేలు మద్దతునివ్వగా, డీకే శివకుమార్‌కి 61 మంది సపోర్ట్ ఇచ్చారు. ఈ ఆధారంగానే హైకమాండ్‌ సిద్దరామయ్య వైపు మొగ్గినట్టు తెలుస్తోంది. 

సీఎంగా రెండు సార్లు

సిద్దరామయ్యకు రెండు సార్లు ముఖ్యమంత్రిగా  బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఉండటం కలిసొచ్చింది. 

అభిమానుల పాలాభిషేకం

సిద్దరామయ్య పేరు ఖరారైనట్టే అన్న సమాచారం అందిన వెంటనే ఆయన అభిమానులు ఇంటి బయట సందడి చేశారు. ఆయన ఫోటోలకు పాలాభిషేకం చేస్తూ నినాదాలు చేశారు. 

రాహుల్‌ని కలిసి వెళ్లిన డీకే



జన్‌పథ్‌లోని సోనియా నివాసానికి వెళ్లి రాహుల్‌తో భేటీ అయిన డీకే శివకుమార్ అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. 




డీకే వెళ్తారా?

సిద్దరామయ్య పేరుని హైకమాండ్‌ అధికారికంగా ప్రకటిస్తే...ఆయన ప్రమాణ స్వీకారానికి డీకే శివకుమార్ వెళ్తారా లేదా అన్నదీ ఉత్కంఠగా మారింది. 

రేపే ప్రమాణ స్వీకారం?

ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య రేపు (మే 18) ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. కంఠీరవ మైదానంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. 

రాహుల్‌తో శివకుమార్ భేటీ

సిద్దరామయ్య పేరు దాదాపు ఖరారైనట్టే అన్న సమాచారం రావడంతో డీకే శివకుమార్ రాహుల్‌తో భేటీ అయ్యేందుకు సోనియా నివాసానికి వెళ్లారు. 

ఉదయం నుంచి వరుస భేటీలు

ఈ ఉదయం నుంచి సిద్దరామయ్య రాహుల్‌ గాంధీ, ఖర్గేతో వరుసగా భేటీ అయ్యారు. 

సిద్దరామయ్యేకే ఓటు!

కర్ణాటక ముఖ్యమంత్రి పదవిని సిద్దరామయ్యకే కట్టబెట్టాలని హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. 

Background

Karnataka Govt Formation:


కర్ణాటకలో భారీ మెజార్టీతో కాంగ్రెస్ గెలిచినప్పటి నుంచి సీఎం పదవిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. డీకే శివకుమార్ ఈ నెల 15వ తేదీనే ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. కానీ...కొన్ని కారణాల వల్ల ఆయన ఆ రోజు వెళ్లలేదు. మరుసటి రోజుఢిల్లీ వెళ్లిన శివకుమార్‌...ఖర్గేతో స్పెషల్‌గా మీట్ అయ్యారు. దాదాపు అరగంట పాటు ఇద్దరూ చర్చించారు. ఈ సమయంలోనే శివకుమార్...తాను ముఖ్యమంత్రి అవ్వాలని ఆసక్తి చూపుతున్నట్టు చెప్పారు. శివకుమార్‌ అలా వెళ్లిపోగానే...సిద్దరామయ్య ఖర్గే ఇంటికి వచ్చారు. ఆ తరవాత సిద్దరామయ్య కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తోనూ భేటీ అయ్యారు. అంతకు ముందు రాహుల్ గాంధీ...ఖర్గే నివాసానికి వెళ్లారు. దాదాపు గంటన్నర పాటు చర్చించారు. ప్రభుత్వ ఏర్పాటు, సీఎం పేరు ఖరారు అంశాలపై డిస్కస్ చేశారు. వీళ్లిద్దరితో పాటు సీఎం రేసులో ఉన్న జీ పరమేశ్వర కూడా స్పందించారు. హైకమాండ్ ఆదేశిస్తే...ఆ కుర్చీలో కూర్చునేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అయితే..ఫైనల్‌గా సోనియా గాంధీని కలిశాకే నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నాయి. అప్పటి వరకూ ఈ సస్పెన్స్‌కి తెరపడేలా లేదు. ఇదిగో అప్పుడు ఇప్పుడు అంటూ కొందరు కాంగ్రెస్ నేతలు చెబుతున్నప్పటికీ...ఫైనల్ డిసిషన్ వచ్చేంత వరకూ ఉత్కంఠ తప్పేలా లేదు. 


చివరి ఎన్నికలు అని చెప్పిన సిద్ధరామయ్య గతంలోనే సీఎంగా సేవలు అందించారు. అందులోనూ ఆయన జేడీఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన నేత. మరోవైపు కాంగ్రెస్ పార్టీతోనే మొత్తం పొలిటికల్ కెరీర్ కొనసాగించిన డీకే శివకుమార్ తనకు ఎలాగైన సీఎం పదవి వస్తుందని ధీమాగా ఉన్నారు. ఎన్నికల్లో తన కష్టం గుర్తించి అధిష్టానం తనకు ఛాన్స్ ఇస్తుందని భావిస్తున్నారు.  అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తానని సోనియాకు మాటిచ్చాను, చెప్పినట్లుగానే గెలిపించి చూపించానంటున్నారు డీకే. ఇక అధిష్టానం తనకు అనుకూల నిర్ణయం తీసుకుంటుందని కొండంత ఆశగా ఉన్నారు.సీఎం పదవి ఒక్కరికి ఇవ్వాలా, లేక చెరో రెండున్నరేళ్లతో మధ్యే మార్గంగా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే చెరో రెండున్నరేళ్లు ఇచ్చినా, మొదట తనకే ఇవ్వాలంటూ సిద్ధరామయ్య, శివకుమార్ పార్టీ హైకమాండ్ ను కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.