Karnataka Election Results Winners: 


కర్ణాటక ఎన్నికల్లో బరిలోకి దిగిన కీలక అభ్యర్థుల్లో ఒకరు కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్. కనకపుర నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విజయం సాధించారు. 50 వేలకుపైగా ఓట్లు సాధించి గెలుపొందారు. బీజేపీ ప్రత్యర్థి ఆర్ అశోకకు కేవలం 8 వేల ఓట్లు దక్కాయి. ఈ ఇద్దరి మధ్య చాలా అంతరం ఉంది. కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో ఉన్న శివకుమార్ గెలవడంపై ఆసక్తి మరింత పెరిగింది. ఇదే నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగోసారి విజయం సాధించారు. ఇక మరో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి సిద్దరామయ్య కూడా విజయం సాధించారు. వరుణ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆయన గెలుపొందారు. సరిగ్గా ఎన్నికల ముందు బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన లక్ష్మణ్ సవాది కూడా అథని నియోజకవర్గంలో విజయం సాధించారు. ఇక బీజేపీ సీఎం అభ్యర్థి బసవరాజు బొమ్మై షిగ్గావ్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి గెలుపొందారు. ఇక బీజేపీ టికెట్ ఇవ్వలేదన్న కోపంతో కాంగ్రెస్‌లో చేరిన మాజీ సీఎం జగదీష్ షెట్టర్ హుబ్లీ ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. కచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేసినా...చివరకు ఓటమి పాలయ్యారు. గెలిచిన తరవాత డీకే శివకుమార్ భావోద్వేగానికి గురయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే చిత్తాపూర్ నియోజవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇక కాంగ్రెస్ తరపున పోటీ చేసిన హెచ్‌కే పాటిల్ కూడా విజయం సాధించారు.