Karnataka Assembly: 


ప్రాంగణంలో గోమూత్రం..


కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. భారీ మెజార్టీ సొంతం చేసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య, డిప్యుటీ సీఎంగా డీకే శివ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. 8 మంది మంత్రులూ బాధ్యతలు తీసుకున్నారు. త్వరలోనే అసెంబ్లీలో అడుగు పెట్టనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కర్ణాటకపై భారీ ఆశలు పెట్టుకున్న బీజేపీ..అనుకున్న లక్ష్యం చేరుకోలేకపోయింది. అయితే...కాంగ్రెస్‌కి మాత్రం ఈ విజయం మంచి బూస్ట్ ఇచ్చింది. సిద్దరామయ్య ఇప్పటికే గత ప్రభుత్వంపై కౌంటర్‌లు వేయడం మొదలు పెట్టారు. అటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బీజేపీపై సెటైర్లు వేస్తున్నారు. మతం కార్డు అన్ని చోట్లా పని చేయదు అంటూ విమర్శిస్తున్నారు. అయితే...ఇప్పుడు కర్ణాటక విధాన సభ దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు కార్యకర్తలు విధాన సౌధ వద్దకు వచ్చారు. ఓ బిందె తీసుకొచ్చారు. అందులో గోమూత్రం నింపారు. విధాన సౌధ ప్రాంగణం అంతా చల్లారు. ఆ తరవాత పూజ కూడా చేశారు. ఇదంతా బీజేపీకి కౌంటరే. ఎందుకిలా చేశారని అడిగితే "అసెంబ్లీని శుద్ధి చేస్తున్నాం అంతే" అని సమాధానమిచ్చారు. అవినీతిమయమైన గత బీజేపీ ప్రభుత్వంతో విధాన సౌధ అపవిత్రమైపోయిందని, గోమూత్రం చల్లి శుద్ధి చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.