What Are Smoke Biscuits: కర్ణాటకలో గత వారం Smoke Biscuits తిని ఓ బాలుడు అస్వస్థతకు గురయ్యాడు. దవనగెరె సిటీలో ఓ షాప్‌లో వాటిని కొనుక్కుని తిన్నాడు. ఆ తరవాతే ఆసుపత్రి పాలయ్యాడు. లిక్విడ్ నైట్రోజన్‌తో తయారు చేసిన ఆ బిస్కెట్స్ వల్లే ఇలా జరిగిందని వైద్యులు వెల్లడించారు. దీనిపై స్పందించిన అధికారులు వెంటనే ఆ షాప్ లైసెన్స్‌ని రద్దు చేశారు. షాప్‌నూ మూసేశారు. అయితే...ఈ స్మోక్ బిస్కెట్స్ తయారు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. డిస్పోజబుల్ కప్‌లో వాటిని సర్వ్ చేస్తున్నాడు ఆ వెండార్. ఈ బిస్కెట్స్‌ని ఓ బాలుడు నోట్లో వేసుకున్న వెంటనే బయటకు ఉమ్మేశాడు. చాలా ఇబ్బంది పడ్డాడు. ఆ తరవాత కాసేపటికి స్పృహ తప్పి పడిపోయాడు. ఈ వీడియోలో ఇదంతా రికార్డ్ అయింది. ఓ ఎగ్జిబిషన్‌లో ఇది జరిగింది. లిక్విడ్ నైట్రోజన్ మోతాదు ఎక్కువవడం వల్ల ఊపిరితిత్తులపై ప్రభావం పడిందని ఆ పోస్ట్‌లో నెటిజన్ వివరించాడు.
ఏంటీ స్మోక్ బిస్కెట్స్..?
స్మోక్ బిస్కెట్స్‌ని లిక్విడ్ నైట్రోజన్‌తో తయారు చేస్తారు. దీన్ని కూలంట్‌గా వాడతారు. ఇది నోట్లో వేసుకుంటే నోటితో పాటు గొంతు, కడుపుకీ ప్రమాదమే. తీవ్రంగా గాయపరిచి ఇబ్బంది పెడుతుంది. లిక్విడ్ నైట్రోజన్ మన శరీరంలోకి వెళ్తే అది తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా బాడీ టెంపరేచర్ 196 డిగ్రీల వరకూ పెరిగే ప్రమాదముంది. స్కిన్ అలెర్జీ, నోటిపూత, కడుపు నొప్పితో పాటు ఇతరత్రా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది. ఈ మధ్య Dry Ice తీసుకున్న వాళ్లూ ఇలాగే ఆసుపత్రి పాలయ్యారు. అది కూడా ప్రమాదకరమే. డ్రై ఐస్, లిక్విడ్ నైట్రోజన్ తెల్లటి ఆవిర్లతో ఉంటాయి. ఆహార పదార్థాలను నిల్వ ఉంచేందుకు వీటిని వినియోగిస్తారు. వీటిని నేరుగా తినడం, చర్మంపై అప్లై చేసుకోవడం లాంటివి చేస్తే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.