Kangana Ranaut has once again become the stuff of viral memes on social media :  కంగనా రనౌత్ వివాదాస్పద స్టేట్ మెంట్లు ఇవ్వడంలో దిట్ట. అయితే ఆమెకు జనరల్ నాలెడ్జ్ చాలా తక్కువ అని అనేక  ఇంటర్యూల్లో వెల్లడయింది. తాజాగా ఆమె ఓ ఇంటర్యూలో దళిత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పేరు తెలియక.. రామ్ కోవిడ్ అని చెప్పడంతో ఇంటర్నెట్ ఒక్క సారిగా బ్లాస్ట్ అయిపోయింది. ఆమెను ట్రోల్ చేస్తూ.. వెల్లువలా వీడియోలు వచ్చేశాయి.    


ఇటీవల ఆమె రైతుల్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో బీజేపీకి హర్యానా ఎన్నికల్లో భారీ నష్టం జరుగుతుందని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆమె మరోసారి ఇలాంటి విజ్ఞాన  ప్రదర్శన చేయడంతో.. ఆమె ఇంతే మాట్లాడుతూ ఉండాలని.. హర్యానాలో బీజేపీ ఓడిపోయిన తర్వాతే ఆపాలని కొంత మంది  నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 





ప్రముఖ ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్ సైట్ ఆల్ట్ న్యూస్ కు చెందిన జుబేర్ కూడా కంగనాపై సెటైర్ వేశారు.  





కంగనా రనౌత్ భారత్ లో అతి తక్కువ ఐక్యూ ఉన్న ఎంపీల్లో మొదటి స్థానంలో ఉంటారని కొంత మంది సెటైర్లు వేశారు. 





ఇలాంటి జెమ్ ను పార్లమెంట్  కు పంపినందుకు హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు అభినందనలు చెప్పాలని ..లేకపోతే ఇలాంటి జెమ్స్ ఉన్నారని మనకు తెలియదని కొంత మంది  సుతిమెత్తని విమర్శలు చేశారు. కంగనా రనౌత్  ఎన్నికల ప్రచార సమయంలోనూ  రాజకీయాలు, అభివృద్ధిపై తనకు పెద్దగా అవగాహన లేదన్న విషయం బయటపడేలా ఇంటర్యూల్లో వ్యాఖ్యలు చేశారు. అయితే అవేమీ ఆమె విజయాన్ని ఆపలేకపోయాయి.  కంగనాపై  సోషల్ మీడియాలో జరిగిన ప్రతి ప్రచారం ఆమెకు హెల్ప్ అయింది. 


అయితే ఇప్పుడు ఆమె ఎంపీగా ఉన్నారు అలాంటి ప్రచారాలు మైనస్ అవుతాయని.. వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేస్తాయని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు.  బీజేపీ తరపున మాట్లాడటానికి ఆమెకు ఎలాంటి అధికారం ఇవ్వలేదని రైతులపై చేసిన వ్యాఖ్యల తర్వాత బీజేపీ అధికారికంగానే ప్రకటించింది.