Prawns Food Festival: కాకినాడలో ప్రాన్స్ ఫుడ్ ఫెస్టివల్ అదుర్స్ అనిపించింది. రొయ్యలు తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయన్న అపోహలు తొలగించేందుకు ఈ తరహా కార్యక్రమాలు దోహదం చేస్తాయని ఏపీ మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ, రహదారులు, భవనాలు శాఖ మంత్రి దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ వంగా గీత, రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు, తదితరులు హాజరై మాట్లాడారు.
కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశే ఖర్రెడ్డి అధ్యక్షతన ఆదివారం కాకినాడ రామసా ఆవరణలో నిర్వహించిన కార్య క్రమానికి మరో ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఏపీఎసీఏ వైస్ ఛైర్మన్ రఘురామ్, ఫిషరీస్ కమి షనర్ కన్నబాబు, ఏఐఎస్ హెచ్ఎ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు కుమార్, ఎక్సపోర్టర్స్ అసోసియే ఓషన్ ప్రతినిధి ద్వారంపూడి వీరభద్రారెడ్డి తదితరులు హాజరయ్యారు.
30 రకాల రొయ్య వంటకాల ప్రదర్శన...
కేవలం రొయ్యల తో తయారు చేసిన 30 రకాల రొయ్య వంటకాలను ప్రదర్శించారు. దేశ విదేశాల్లో ఉన్న పలు రకాలను అందుబాటులో ఉంచడంతో మాంసాహార ప్రియులు విందు ఆరగించారు. రొయ్యలతో వంటకాలను ఏ విధంగా తయారు చేయవచ్చు, రొయ్యల ఆహారం వల్ల ప్రయోజనాలను వివరిస్తూ ముద్రించిన పుస్తకాన్ని రాష్ట్ర మంత్రులు అప్పలరాజు, దాడిశెట్టి రాజా, ఎంపీ, ఎమ్మెల్యేలు ఆవిష్కరించారు.
రొయ్యల్లో 40 శాతం అమెరికాకు..
దేశంలో ఉత్పత్తి అవుతున్న రొయ్యల్లో 40 శాతం అమెరికా వాసులు వినియోగిస్తున్నారని, చైనాలో 28 లక్షల టన్నుల ఆహారంగా వినియోగిస్తున్నారని అయితే మన దేశంలో రొయ్యల పై ఉన్న అపోహల వల్ల చాలా తక్కువ శాతం మంది తింటున్నారని పలువురు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 400 హేచరీస్ ఉంటే, కాకినాడ చాప్టర్ పరిధిలోనే 250 ఉన్నాయని, 60 శాతం రొయ్యలు కాకినాడ నుంచే ఉత్పత్తి అవుతున్నాయన్నాని హెచరీస్ యజమానులు తెలిపారు.
రొయ్యల వంటకాల రుచులను ఆస్వాదించిన ప్రముఖులు...
కాకినాడలో ఏర్పాటు చేసిన ప్రాన్స్ ఫుడ్ ఫెస్టివల్ లో దాదాపు 30 రకాల కేవలం రొయ్యలతో చేసిన వంటకాలను ప్రదర్శించారు. వీటి రుచులను ప్రముఖులు, ఆహ్వానితులు తింటూ ఆస్వాదించారు.