Kadiyam Kavya Fathers Day : ప్రేమకు ప్రతిరూపం అమ్మ అయితే... అనురాగానికి, ఆప్యాయతకు ప్రతిరూపం నాన్న. తల్లి నవ మాసాలు మోసి పిల్లలకి జన్మనిస్తే. ఆ పిల్లలకు రక్షణగా ఉంటూ ఉన్నత స్థానాల్లో స్థిరపడడానికి అహర్నిశలు కృషి చేస్తాడు తండ్రి. అయితే రాజకీయ కుటుంబాల్లో కొంత భిన్నంగా ఉంటుంది. నాయకులు నిత్యం ప్రజల్లో ఉంటారు కాబట్టి పిల్లల భాద్యతలను తల్లి చూస్తుంది. అయితే తన తండ్రి రాజకీయాల్లో ఎంత బిజీ గా ఉన్న పిల్లల బాధ్యత విషయంలో ఏ రోజు నిర్లక్ష్యం చేయలేదని నాన్న గురించి గొప్పగా చెప్పింది వరంగల్ ఎంపి కడియం కావ్య.


కుమార్తెల భవిష్యత్ కోసం కలలు కన్న  కడియం శ్రీహరి 


30 సంవత్సరాల కు పైగా క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతూ ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా నిత్యం బిజీగా ఉంటూ వస్తున్నారు కడియం శ్రీహరి. అయితే రాజకీయ జీవితంలో కుటుంబం, పిల్లల బాధ్యతలను చూసుకోవడం కష్టమైన పని. ఎందు కంటే పదవిలో ఉన్న లేకపోయినా నిత్యం ప్రజల్లో ఉంటూ తిరగాల్సిన పరిస్థితి. కడియం శ్రీహరి రాజకీయాలతో పాటు పిల్లలను ప్రత్యేక శ్రద్ధతో పెంచారని కడియం శ్రీహరి కుతూరు, వరంగల్ ఎంపి కావ్య అన్నారు. ఏడవ తరగతిలో నాన్న ఎమ్మెల్యే, మంత్రి అయిన తరువాత కూడా నాతోపాటు ఇద్దరు చెల్లెల చదువు విషయంలో బాధ్యత తీసుకున్నారని కడియం కావ్య అన్నారు. చదువు, కెరీర్ విషయంలో నాన్న పర్యవేక్షణలోనే సాగి నాతోపాటు ఇద్దరు చెల్లెళ్లు ఉన్నత స్థానాల్లో ఉన్నామని కావ్య చెప్పారు. 


ప్రెండ్లీగా ఉండే ఫాదర్ కడియం శ్రీహరి 


నాన్న ఎంత బిజీగా ఉన్నా ఏ రాత్రి వచ్చిన నాన్న మిస్ అయ్యామె అనే భావన ఎప్పుడు రాలేదని, రాజకీయంగా దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే తనతో తీసుకు వెళ్లేవారని కావ్య అన్నారు. ఈరోజు పిల్లలపై తన ఇది చెయ్యి అది చెయ్యి అని రుద్దలేదని కేవలం గైడ్ చేసేవాడని కావ్య తెలిపారు. అమ్మ తెలియకుండా ప్రభావం చూపెడితే నాన్న తన జీవితాన్నే మా ముందు పెట్టేవారని..  అదే జీవితాన్ని అలవర్చుకున్నమని కావ్య అన్నారు. పెద్ద కూతురు గా తన పై ఎక్కువ ప్రేమ ఉండేదన్నారు. డే అంత నాన్న ఇంట్లో లేకపోవడంతో అమ్మ భాధ్యత తీసుకొనే సమాజంలో ఎలా ఉండాలో చిన్న మాటలతో చెప్పేదని కావ్య అన్నారు. నాన్న ఎమ్మెల్యే, మంత్రి అయిన ఆ గర్వంతో పెంచలేదని చాలా సింపుల్ గా పెంచారని, తండ్రి పైన ఇది కావాలి, అది కావాలని ఎప్పుడు గొడవ చేయలేదని కాలేజి రోజులకు వచ్చిన తరువాత మాతో ఫ్రెండ్లీగా ఉన్నారని కావ్య చెప్పారు.


ముందు వద్దన్నా తర్వాత రాజకీయాల్లో ప్రోత్సహం 


రాజకీయాల్లో అమ్మాయిలకు ఇబ్బంది ఉంటుంది అని చెప్పి వద్దన్నారు. తరువాత డాక్టర్ వృత్తిలో కొనసాగుతూ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న సందర్భంలో తనకు రాజకీయాలు అంటే ఇష్టమని భావించి అవకాశాల కోసం వేచి చూసి నాన్న ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకువచ్చారని కావ్య చెప్పారు. కుటుంబంలో సమస్యలు వస్తే తల్లి కోపానికి గురి కావడం జరుగుతుంది కానీ తండ్రి అలా కాదని ఎంపి  ఎన్నికల్లో కుటుంబం, శ్రీహరి పై వచ్చిన ఆరోపణలు, విమర్శలు పక్కన పెట్టి కూతురి కోసం బాధను దిగమింగుకొని తన విజయం కోసం పాటుపడ్డారని కావ్య అభిప్రాయపడ్డారు. చిన్న నాటి నుండి ఇప్పటి వరకు భాగా చదువుకోవాలని కోపం చేశాడు తప్ప ఎప్పుడు కోపం వచ్చేది కాదని కావ్య చెప్పారు.