Khalistani terrorist Gurpatwant Singh Warning : ఖలీస్థాన్ వేర్పాటుు వాదులు భారత్ పై దాడులు చేస్తామని హెచ్చరికలు కూడా చేస్తున్నారు. అక్టోబర్ 5న నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే వరల్డ్ కప్ మ్యాచ్ ను టార్గెట్ చేస్తామంటూ మాట్లాడిన ఖలీస్థానీ టెర్రరిస్ట్ పన్నూన్ బెదిరింపు ఆడియో బయటకు వచ్చింది. హర్దీప్ సింగ్ జిజ్జర్ హత్య, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోను అవమానించడంపై ఖలిస్థాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ భారత్ కు, ప్రధాని నరేంద్ర మోడీకి తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. కెనడా, భారత్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పన్నూన్ చేసిన ముందస్తు కాల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తన సిక్కుస్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే ) గ్రూప్ తరఫున తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పన్నూన్ హెచ్చరించారు. అక్టోబర్ 5న జరిగే ఐసీసీ వరల్డ్ కప్ 2023 తొలి మ్యాచ్ కు ఆతిథ్యమిచ్చే అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంపై దాడికి ప్లాన్ చేస్తున్నట్లు పన్నూన్ తెలిపారు. షహీద్ నిజ్జర్ హత్యపై మీ బుల్లెట్ కు వ్యతిరేకంగా బ్యాలెట్ ను ప్రయోగించబోతున్నామని.. మీ హింసకు వ్యతిరేకంగా మేము ఓటును ఉపయోగించబోతున్నామమని ఆడియోలోపన్నూన్ తెలిపారు.
'ఈ అక్టోబర్ లో ప్రపంచకప్ ఉండదు. వరల్డ్ కప్ కు ఇది ఆరంభం కానుంది. సిక్కూస్ ఫర్ జస్టిస్ జనరల్ కౌన్సిల్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ నుంచి ఈ సందేశం వచ్చింది' అని పన్నూన్ తెలిపారు. ఒట్టావాలోని భారత రాయబార కార్యాలయాన్ని మూసివేయాలని పన్నూన్ డిమాండ్ చేశారు. కెనడా ప్రధాని ట్రూడోను ప్రధాని మోదీ అవమానించారని, కెనడాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఒట్టావాలోని రాయబార కార్యాలయాన్ని మూసివేయాలని భారత ప్రభుత్వానికి ఆయన హెచ్చరికలు జారీ చేశారు. భారత రాయబారి వర్మను వెనక్కి తీసుకెళ్లాలన్నరు.
ప్రధాని ట్రూడోను అవమానించినందుకు మోదీని, రాయబారి వర్మను బాధ్యులను చేస్తాం. వర్మను వెనక్కి రప్పించడం, ఒట్టావా రాయబార కార్యాలయాన్ని మూసివేయడం చాలా తెలివైన పని' అని పన్నూన్ పేర్కొన్నారు. ఖలీస్థానీ తీవ్రవాదులు ఇలా భారత్ ప్రధానికే నేరుగా హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.