Air Quality Index In Andhra Pradesh And Telangana : తెలంగాణ(Telangana)లో వాయు నాణ్యత స్థిరంగా కొనసాగుతోంది. కొన్ని రోజులుగా తెలంగాణలో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌(AOI) 65గా నమోదవుతూ వస్తోంది. ఇలా స్థిరంగా కొనసాగుతుండడం వల్ల పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ ఇవాళ కూడా 65గా నమోదైంది. ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 65గా నమోదు కావడం వల్ల తీవ్ర శ్వాస కోస సమస్యలు ఉన్న వారికి కాస్త ఇబ్బందులు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత స్థిరంగా కొనసాగుతూ ఉంది.


బెల్లంపల్లిలో మాత్రం ఎయిర్‌ క్వాలిటీ ఇంకా మెరుగుపడలేదు. మొత్తం తెలంగాణలోనే వాయు నాణ్యత బెల్లంపల్లిలోనే దారుణంగా ఉంది. కొత్తపేట్‌లో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 132గా నమోదైంది. తెలంగాణలో కొత్తపేట్‌లో వాయు నాణ్యత ఎక్కువగా క్షీణించింది. ఈ ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యలు హెచ్చరించారు. మంచిర్యాల్‌లో వాయు నాణ్యత 110, బెల్లంపల్లిలో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 107గా నమోదైంది. మంచిర్యాల్‌, బెల్లంపల్లిలో గాలి నాణ్యత క్రమంగా  దిగజారుతుండడంపై వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో కంటే ఎక్కువగా కొత్తపేట్‌, మంచిర్యాల్‌ బెల్లంపల్లి, మందమర్రి, రామగుండం ప్రాంతాల్లో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాద స్థాయికి చేరడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. తెలంగాణలో గాలిలో 2.5 పీఎం దూళి కణాలు 1.3 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ గణాంకాలు తెలిపాయి. తెలంగాణలో సూర్యోదయం 6.26 నిమిషాలకు జరిగింది. సూర్యాస్తమయం సాయంత్రం 6.26కు జరగనుంది. తెలంగాణలో రానున్న వారం రోజుల్లోనూ దాదాపుగా ఇలాగే ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్ నమోదతయ్యే అవకాశం ఉంది. వచ్చే వారం రోజులు కూడా వాయు నాణ్యతలో పెద్దగా మార్పులు ఉండవని.. అయితే శ్వాస కోస సమస్యలు ఉన్నవారు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలని ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ వెల్లడించింది.


భాగ్యనగరంలో ఇలా...

హైదరాబాద్‌(Hyderabad)లోనూ వాయు నాణ్యత ప్రమాణం ఇవాళ చాలా మెరుగ్గా నమోదైంది. చాలా రోజుల తర్వాత భాగ్యనగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌.... గుడ్‌గా నమోదైంది. హైదరాబాద్‌లో ఇవాళ వాయు నాణ్యత 50గా నమోదైంది. భాగ్యనగరం ప్రజలు బయటకు వెళ్లవచ్చని... వాతావరణం మేఘావృతమైనా ఎలాంటి ఇబ్బంది ఉండబోదని ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ తెలిపింది. హైదరాబాద్‌లో కోకాపేటలో వాయు నాణ్యత కాస్త ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ మాత్రం ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కాస్త అప్రమత్తంగా ఉండాలని ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్ సూచించింది.

 

ఆంధ్రప్రదేశ్‌లో

ఆంధ్రప్రదేశ్‌(AP)లో వాయు నాణ్యత మెరుగ్గానే ఉంది. గతంలోలానే స్థిరంగా కొనసాగుతోంది. ఏపీలో ఇవాళ వాయు నాణ్యత 55గా నమోదైంది.  ఆంధ్రప్రదేశ్‌ గాలిలో 2.5 పీఎం దూళి కణాలు ప్రమాదకరస్థాయి కంటే తక్కువగా ఉన్నట్లు ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ గణాంకాలు తెలిపాయి.