Juhi Chawla goes viral : " హమ్మయ్య నాది డాలర్ అండర్‌వేర్.. అదే రూపీ అయితే ఎప్పటికప్పుడు కిందకు జారిపోయేది" అని అని 2013లో హీరోయిన్ జూహీచావ్లా సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి కారణం అప్పటితో పోలిస్తే ఇప్పుడు మరింతగా రూపాయి బలహీనపడింది. అప్పట్లో డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ 60 రూపాయులు అయితేనే ఈ కామెంట్స్ చేశారు. ఇప్పుడు అది 90 దాటిపోయింది.
అయితే అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమీ చేతకావడం లేదని సినీ ప్రముఖులు విమర్శలు చేశారు. రూపాయి పడిపోయినప్పుడు జూహీచావ్లా కూడా ఇలా తన అండర్ వేర్ కంపెనీకి ముడిపెట్టి వ్యాఖ్యలు చేయడంతో వైరల్ అయిపోయింది.
అప్పట్లో అంటే 2013లో ఎన్నికల వేడి ప్రారంభమైన సమయంలో ఇలా రూపాయి గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యేవి. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ .. రూపాయి బలహీనపడటం.. మన్మోహన్ చేతకాని తనంగా చెప్పవారు. ఆ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.
అయితే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ నేతలు రూపాయి పతనాన్ని భిన్నంగా సమర్థించుకుంటున్నారు. ఇలా వారు చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి.
మొత్తంగా కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా రూపాయి పతనం మాత్రం ఆగదని స్పష్టమయింది. కానీ రాజకీయ విమర్శలు మాత్రం.. కొత్తవి .. పాతవి..కలిసి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.