Netizens Calls Journalist Traitor : పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్  మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.  రెండు దేశాలు పరస్పరం ఆయుధాలను ఎక్కుపెట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో తమ మిలటరీ సమచారం బయటకు పోకుండా ఉండటానికి రెండు దేశాలు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. భారత్ లో మీడియా ప్రభావం ఎక్కువ కాబట్టి..  మీడియా, సోషల్ మీడియాకు కేంద్రం కొన్ని ఆంక్షలు పెట్టింది. ఆ ఆంక్షలను ధిక్కరించిన జర్నలిస్టు..  శ్రీనగర్ లోని లాల్ చౌక్ లో బలగాల కదలికలపై ప్రత్యక్ష ప్రసారం ఇచ్చారు. దానిపై సోషల్ మీడియాలో వివాదం ప్రారంభమయింది. ఆ జర్నలిస్టుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. 

ఆ జర్నలిస్టు గతంలోనూ అలాగే వ్యవహరించారని పలు విమర్శలు ఉన్నాయి. ఆ విషయాలను నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. 

మీడియాకు కేంద్రం చేసిన సూచనలు ఇవే... .  జాతీయ భద్రత దృష్ట్యా, అన్ని మీడియా ప్లాట్ఫామ్లు, వార్తా సంస్థలు, సోషల్ మీడియా వినియోగదారులు రక్షణ కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం చేయకూడదు.’ ఇలా చేయడం వల్ల దేశానికి సంబంధించిన కీలకమైన వ్యూహాత్మక నిర్ణయాలు శత్రువులు పసిగట్టే ప్రమాదం ఉంది.

 భద్రతా సంబంధిత కార్యకలాపాలకు సంబంధించిన విషయాలను నివేదించేటప్పుడు అత్యంత బాధ్యత వహించాలి.  ప్రస్తుత చట్టాలు ,నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు” అని పేర్కొన్నారు.ప్రత్యేకంగా రియల్-టైమ్ కవరేజ్, దృశ్యాల ప్రసారం, రక్షణ కార్యకలాపాలు , సైన్యం కదలికలకు సంబంధించిన సమాచారం బహిర్గతం చేయకూడదు.   

సున్నితమైన సమాచారాన్ని ముందస్తుగా బహిర్గతం చేయడం వల్ల అనుకోకుండా శత్రువులకు సహాయం చేసినట్టే అవుతుందని అన్నారు. దేశం  ప్రణాళికలను అమలు చేయడంలో ఇబ్బంది కలగడమే కాకుండా సైన్యం భద్రతకు ప్రమాదం కలిగించవచ్చు. 

కార్గిల్ యుద్ధం, ముంబై ఉగ్రవాద దాడుల సమయంలో ఇలాంటి ఘటనలు ముప్పు తెచ్చాయి.  ‘అపరిమిత కవరేజ్ జాతీయ ప్రయోజనాలపై ఊహించని ప్రతికూల పరిణామాలను కలిగించింది. 

 గత ఘటనలు బాధ్యతాయుతమైన రిపోర్టింగ్ ప్రాముఖ్యత గుర్తు చేస్తున్నాయి. కార్గిల్ యుద్ధం, ముంబై ఉగ్రవాద దాడులు (26/11), కాందహార్ హైజాక్ ఘటనల సమయంలో అపరిమిత కవరేజ్ ప్రతికూల పరిణామాలకు కారణమైంది. 

అందుకే ఈ సారి అలాంటి తప్పిదాలు జరగకూడదని కేంద్రం చెప్పింది. అయితే కొంత మంది జర్నలిస్టులు తాము చేయాలనుకున్నది చేస్తున్నారు.