Mona Lisa Dance:  కుంభమేళా పుణ్యమా అని వైరల్ అయిన మోనాలిసా బోంస్లే ఇప్పుడు దేశవ్యాప్తంగా సెలబ్రిటీ అయ్యారు. జ్యూవలరీ దుకాణాల ప్రారంభోత్సవాలకు ముఖ్య అతిధిగా హాజరై సందడి చేస్తున్నారు. కేరళలోని ఓ జ్యూవలరీ దుకాణం ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపై ఆమె డాన్స్ చేశారు. 





మోనాలిసా ఇప్పటి వరకూ పూర్తి స్థాయి మేకప్ లో ఎప్పుడూ కనిపించలేదు. కానీ కేరళలో మాత్రం.. ఆమె పూర్తి మేకోవర్ లో కనిపించడం వైరల్ గా మారింది.  





 తాను ఓ సినిమాను కూడా అంగీకరించానని.. ఆమె సంతోషంగా చెబుతున్నారు. 





 ఇది సోషల్ మీడియా యుగమని.. రాత్రికి రాత్రి సూపర్ స్టార్లు అయిపోతారని కొంత మంది కాంప్లిమెంట్ ఇస్తున్నారు. 


 





మధ్యప్రదేశ్ కు చెందిన ఓ గిరిజన కుటుంబానికి చెందిన మోనాలిసా భోంస్లే.. కుంభమేళాలో పూసలు అమ్ముతూ కనిపించారు. ఓ వ్యక్తి ఆమె చాలా అందంగా ఉందని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో  ఇన్ స్టంట్ వైరల్ గా మారింది. దీంతో ఆమె కుటంబం రాత  మారిపోయింది.  ఆమెను స్టార్ క్యాంపెయినర్లుగా పెట్టుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు.  సినిమా ఆఫర్ కూడా వచ్చింది దుకాణాల ప్రారంభోత్సవాలకు పిలుస్తున్నారు.  కొన్ని బంగారు దుకాణాల ప్రారంభోత్సవాలకు కూడా ఆమెను  పిలుస్తున్నారు. పూసలుకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని పిలుస్తున్నారు.                


అత్యంత నిరుపేద కుటుంబం.. పూసలు అమ్ముకుంటే తప్ప పూటగడవని కుటుంబం అయినప్పటికీ ఆమె మంచి కాన్ఫిడెంట్ గా సెలబ్రిటీ స్టేటస్ ను నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. డాన్సులు కూడా నేర్చుకుంటున్నారు. ఆమె త్వరగా కలసిపోతూండటంతో సినిమా ఇండస్ట్రీలో కూడా పాతుకుపోతుందని గట్టిగా నమ్ముతున్నారు నెటిజన్లు. ఇప్పటికే ఆమెకు దక్షిణాది నుంచి కూడా ఆఫర్లు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒవర్ నైట్ తో మోనాలిసా లైఫ్ మారిపోయిది. దానిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆమెపైనే ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.                        


Also Read: 'వ్యక్తిగత పరిచయంతో వైసీపీ నేతలకు ప్రచారం' - ఆ కారణంతో చాలా కోల్పోయాను, సింగర్ మంగ్లీ బహిరంగ లేఖ