JC Prabhaker Reddy: తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి వేధింపులు తాళలేకే సీఐ ఆనంద్ ఆత్మహత్య చేసుకున్నారని జేపీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. నిజంగానే ఎమ్మెల్యేకు ఎలాంటి సంబంధమూ లేకపోతే తెల్లవారుజామున 4 గంటలకు అక్కడకి ఎమ్మెల్యే ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. కావాలనే ఆధారాలు తుడిచేసేందుకు అక్కడకు వెళ్లారని అన్నారు.  ఆనందరావు ఫోన్ లోని కాల్ డేటాను డిలీట్ చేసి.. అలాగే ఫింగర్ ప్రింట్స్ వంటి ఆధారాలను కూడా తుడిచేశారని చెప్పారు. అనంతపురంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ ఆత్మహత్య చేసుకున్న సీఐ కుటుంబ సభ్యులు మాట్లాడిన వీడియోలను ప్రదర్శించారు. పోలీసు అధికారులు సీఐ ఆనందరావును తీవ్రంగా బాధ పెట్టడమే కాకుండా ఒత్తిడిరకి గురి చేయడం వల్ల ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. 



"నువ్వు కూడా ఫోరెన్సిక్ ఆఫీసర్వా?? కాదు కదా. మీరు ఎక్కడ దొరికిపోతారేమోననే భయంతోనే ఆగ మేఘాల మీద సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాల్ డేటా, ఫింగర్ ప్రింట్స్ వంటి ఆధారాలను తుడిచేయాలనుకున్నారు. సూసైడ్ నోట్ తీసుకున్నారు. అధికారులంతా కలిసి యువతి వాంగ్మూలాన్ని కూడా మార్చారని సీఐ కూతురు స్పష్టం చేసినా రాజకీయ అంతరాలే కారణమని సీఐ తండ్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం చెన్నేకొత్తపల్లిలో పనిచేస్తున్న ఎస్‌ఐ శ్రీధర్‌.. డీఎస్పీ చైతన్య ఉన్నప్పుడు ఎన్‌ఓసీ సంతకాలు తనవని చెప్పడంతో అవి ఎస్‌ఐలవి కావని చైతన్య ఒత్తిడి తెచ్చి కేసులు పెట్టేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు ఇన్సూరెన్స్ విషయంలో కేసు నమోదు చేయాలని సీఐపై ఎమ్మెల్యే నుంచి తీవ్ర ఒత్తిడి వస్తోంది. కోర్టు ఆదేశాల మేరకు ఫైజ్‌పై కేసు నమోదైంది. ఫైజ్‌ను ఎస్సీ కేసు నుంచి తొలగించేందుకు ఆదివారం మధ్యాహ్నం ఎస్‌ఐసీఐ డీఎస్పీ ఆధ్వర్యంలో ఫైజ్‌ సమావేశం కాలేదా? దీనికి సీఐ అంగీకరించకపోవడంతో ఎమ్మెల్యే దుర్భాషలాడింది వాస్తవం కాదా? మహిళలు కమలమ్మపై కేసులు, లక్ష్మీదేవిపై అక్రమ కేసులు, ఒకే అంశంతో నమోదు కాలేదా? 307 కేసులో జైలుకు వెళ్లిన కమలమ్మ కండిషన్ బెయిల్ రద్దు చేయాలని సీఐపై ఒత్తిడి చేయలేదా?? ఇవన్నీ కలిసి అతనికి చాలా ఒత్తిడిని కలిగించి ఆత్మహత్యకు దారితీశాయి!" అన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి.


రెండ్రోజుల కిందట సీఐ ఆత్మహత్య


అనంతపురం జిల్లా తాడిపత్రిలో సిఐగా పని చేస్తున్న ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారు. తన రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని తనువు చాలించారు. ఈ ఆత్మహత్యకు కారణం ఏమై ఉంటుందనే విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పని ఒత్తిడే కారణమని ప్యామిలీ అంటుంటే... రాజకీయ ఒత్తిళ్లు కూడా ఉంటాయనే వాదన వినిపిస్తోంది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. సీఐ ఆనందరావు ఆత్మహత్య విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తాడిపత్రి చేరుకున్నారు. ఆయన ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఆనందరావు ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణంగా చెప్పారు. ఆయనపై ఎలాంటి పని ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. 



ఫ్యామిలీ మాత్రం ఆనందరావు మృతికి పని ఒత్తిడే కారణమని చెబుతున్నారు. ఆనందరావు కుమార్తె మాట్లాడుతూ.. తన తండ్రి ఎప్పటి నుంచో పని ఒత్తిడిలో ఉన్నారని చెప్పారు. గతంలో చాలా ప్రాంతాల్లో పని చేసినా ఇలాంటి పరిస్థితిలేదని అన్నారు. గత కొద్ది రోజులుగా చాలా ప్రెజర్‌కు లోనైనట్టు తెలియజేశారు. ప్రెజర్ ఎక్కువగా ఉందని హ్యాండిల్ చేయలేకపోతున్నట్టు తరచూ చెప్పేవారని కుమార్తె వివరించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరికి చెందిన సీఐ గతంలో చాలా ప్రాంతాల్లో పని చేశారు. తిరుపతి, కడపలో కూడా పని చేశారు. గత సెప్టెంబ్‌లో కడప నుంచి తాడిపత్రికి బదిలీపై వచ్చారు.