డక గది సమస్యలను సమస్యలను పరిష్కరించడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా పురుషులు ఆ విషయంలో చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. తమ పార్టనర్‌ దగ్గర మంచి మార్కులు కొట్టేయాలనే ఉద్దేశంతో వయాగ్రా వంటి డ్రగ్స్‌కు కూడా అలవాటు పడతారు. అయితే, అవి అప్పటికప్పుడు తాత్కాలికంగా సుఖాన్ని అందించవచ్చు. కానీ, భవిష్యత్తులో వాటి వల్ల చాలా సమస్యలు ఏర్పడతాయి. స్తంభన సమస్యలను ఎదుర్కొంటారు. అలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు పరిశోధకులు ఒక సేఫ్ డ్రింక్‌ను సూచిస్తున్నారు. అదే రెడ్ వైన్.


ఔనండి, మీరు విన్నది నిజమే రెడ్ వైన్ పురుషుల్లో ఆ సామర్థ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. అంతేకాదు, గతంలో జరిపిన పరిశోధనల్లో కూడా ఇదే విషయం తేలింది. రెడ్ వైన్ పురుషులకు అమృతంలా పనిచేస్తుందని, పడక గదిలో పార్టనర్‌తో ఏర్పడే సమస్యల నుంచి గట్టెక్కిస్తుందని పరిశోధకులు తెలిపారు. ఇందుకు కారణాలను కూడా వెల్లడించారు. 


రెడ్ వైన్‌లో ఉండే పోలీఫోనాల్స్ (polyphenols) రసాయనం మగాళ్లకు లైంగిక శక్తిని అందిస్తుందని తెలిసింది. అంతేకాదు, మహిళల్లో కోరికలను పెంచేది కూడా అదేనట. గత 30 ఏళ్లుగా దీనిపై జరుగుతోన్న పరిశోధనలు రివ్యూ చేసిన నిపుణులు.. ఈ విషయాన్ని ధృవీకరించారు. రెడ్ వైన్ కోరికలను ప్రేరేపించడమే కాకుండా, లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుందట. అలాగే, పురుషుల్లో టెస్టోస్టెరోన్ (testosterone) స్థాయిలను పెంచి.. సంతానోత్పత్తికి సహకరిస్తుందట. 


పోలీపోనాల్స్ అనేవి బలమైన యాంటీ ఆక్సిడెంట్లు.. అవి గుండె, రక్త నాళాల్లో అంతర్గత మార్గాలను సక్రమంగా పనిచేసేందుకు సహకరిస్తాయి. దానివల్ల శరీరంలోని ఇతర అవయవాలకు రక్త ప్రవాహం పెరుగుతుంది. చివరికి మర్మాంగాల వద్ద కూడా రక్త ప్రవాహం పెరగడం వల్ల కోరికలు పెరగడమే కాకుండా.. పురుషుల్లో లైంగిక ప్రేరణ కలుగుతుంది. దానివల్ల బెడ్ మీద ఎక్కువ సేపు పార్టనర్‌తో కలయికలో పాల్గొనవచ్చు.  


ఇటలీకి చెందిన పరిశోధకులు.. సాధారణ మహిళలతో పోల్చితే, రోజూ ఒక గ్లాస్ రెడ్ వైన్ తాగే మహిళల్లో లైంగిక కోరికలు ఎక్కువని పేర్కొన్నారు. ముఖ్యంగా వయస్సు మీద పడుతున్న మహిళలకు ఈ రెడ్ వైన్ ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఇందుకు రెడ్ వైన్‌లో ఉండే ఆల్కహాల్, పోలీఫోనాల్స్ కారణమని వెల్లడించారు. అవి వారిలో ఉద్వేగానికి కారణమవుతాయని తెలిపారు. అప్పుడప్పుడు మద్యం తాగేవారు, వైట్ వైన్ తాగేవారిలో కూడా ఈ ప్రేరణ ఉంటుందన్నారు. లైంగిక శక్తికి మంచిది కదా అని అతిగా తాగొద్దని కూడా సూచించారు. అలా తాగితే మొదటికే మోసం వస్తుందని, లైంగిక ఆరోగ్యం దెబ్బతిని ఎందుకూ పనికి రాకుండా పోతారని హెచ్చరించింది. చివరికి శరీరంలోని ఇతర అవయవాలు కూడా దెబ్బతిని అనారోగ్యాలకు గురవ్వుతారని పేర్కొంది. కాబట్టి, ఏదైనా మితంగానే తీసుకోండి. అప్పుడే.. మీరు అనుకున్నది పని నెరవేరుతుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: అబ్బాయిలూ ఈ పనులు చేస్తున్నారా? మీ మగతనం మటాషే!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial