Jayalalithaa Death Case:


ఆడియో క్లిప్‌లో ఏముందంటే..


తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై ఇచ్చిన అరుముగసామి రిపోర్ట్ రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టించింది. AIDMK,DMK మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌ తప్పుల తడక అని ఇప్పటికే శశికళ స్టేట్‌మెంట్ ఇచ్చారు. విచారణకు కూడా సిద్ధమేనంటూ ప్రకటించారు. ఈ వివాదం నడుస్తుండగానే...జయలలిత హాస్పిటల్‌లో ఉండగా రికార్డ్ చేసిన ఓ ఆడియో క్లిప్ వైరల్ అవుతోంది. జయలలిత చాలా నీరసంగా మాట్లాడుతూ...తీవ్రంగా దగ్గుతుండగా ఓ స్టాఫ్ మెంబర్ ఆ ఆడియో రికార్డ్ చేశాడు. ఆసుపత్రి సిబ్బందిపై చిరాకు పడుతూ..ఏదో కంప్లెయింట్ చేస్తున్నట్టు ఆ ఆడియో వింటే తెలుస్తోంది. దీనంతటినీ ఓ స్టాఫ్ మెంబర్ రికార్డ్ చేశాడు. అరుముగసామి 
రిపోర్ట్‌పై వివాదం నడుస్తున్న సమయంలోనే ఈ ఆడియో బయటకు రావటం...ఇంకాస్త వేడి పెంచింది. ఆడియో మాత్రమే కాదు. జయలలితకు చికిత్స అందించిన డాక్టర్ రిచర్డ్ బీలే వీడియో కూడా వైరల్ అవుతోంది. 2017లో రికార్డ్‌ అయిన ఈ వీడియోలో ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. "జయలలితను విదేశాలకు తీసుకెళ్లి చికిత్స అందించాలని చెప్పాను. మొదట అందరూ ఒప్పుకున్నారు. తరవాత ఎందుకో ఆమె అందుకు ఒప్పుకోలేదు. ఆమె వద్దన్నారనే ఆగిపోయాం" అని చెప్పారు. అయితే...ఈ కామెంట్స్ చేసేటప్పుడు ఆయన కాస్త తడబడ్డారని కొందరు వాదిస్తున్నారు. అంటే...ఏదో కావాలనే దాచి పెడుతున్నారు. 


టార్గెట్ శశికళ..


జయలలిత మరణానికి ముందు జరిగిన కొన్ని పరిణామాలు శశికళను అనుమానించే విధంగా ఉన్నాయంటూ అరుముగసామి కమిటీ ఓ నివేదిక వెలువరించింది. శశికళపై తీవ్ర ఆరోపణలు చేసింది. జయ మరణించారని చెప్పటానికి ఓ రోజు ముందే గుండె ఆగిపోయిందని, ఈ విషయంలోనే అనుమానాలున్నాయని నివేదిక తెలిపింది. జయలలిత చికిత్సలో శశికళ జోక్యం చేసుకున్నారనీ చెప్పింది. దీనిపై...శశికళ తీవ్రంగా స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణల్ని ఖండించారు. "నాపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నాను. ఆ నివేదిక అంతా తప్పుల తడక. జయలలిత వైద్యం విషయంలో నేనెలాంటి జోక్యం చేసుకోలేదు. దీనిపై విచారణకైనా నేను సిద్ధమే" అని స్పష్టం చేశారు. తమిళనాడు అసెంబ్లీలో అరుముగసామి నివేదిక ప్రకంపనలు సృష్టించింది. శశికళను కచ్చితంగా విచారించాల్సిదేనని తేల్చి చెప్పింది. మాజీ ఆరోగ్య మంత్రి విజయభాస్కర్ సహా మాజీ హెల్త్ సెక్రటరీ రాధకృష్ణన్, డాక్టర్ శివకుమార్‌నూ విచారించాలని స్పష్టం చేసింది. అంతకు ముందు ఈ ప్యానెల్...నివేదికను ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్‌కు అందజేసింది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై విచారణకు ఆదేశించింది.


2016లో సెప్టెంబర్ 22న జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రిపాలయ్యారు. అప్పటి నుంచి ఆమె మరణించిన వరకూ ఏం జరిగిందో తేల్చి చెప్పాలని ఆదేశించింది స్టాలిన్ సర్కార్. అయితే...శశికళే నిందితురాలు అని తేల్చి చెప్పలేదు నివేదిక. కేవలం అనుమానిస్తున్నట్టుగానే వెల్లడించింది. ఇక్కడ కీలకంగా చర్చకు వస్తున్న అంశం ఒక్కటే. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అనారోగ్యానికి గురైతే...
ఇక్కడ వైద్యం అందించలేకపోతే ఆమెను విదేశాలకు తరలించి ఉండొచ్చు కదా అనే ప్రశ్న తెరపైకి వస్తోంది. డాక్టర్ రిచర్డ్ బీల్‌ అందుకు సిద్ధం అని చెప్పినా...ఎందుకు ఆ పని చేయలేదని ప్రశ్నించింది నివేదిక. 


Also Read: NASA Captures iconic Pillars: నక్షత్రాల పుట్టినిల్లు ఎలా ఉందో చూశారా? కొత్తగా చూపించిన జేమ్స్‌వెబ్ టెలిస్కోప్