టాలెంట్ ఉండాలే గానీ సినీ ఇండస్ట్రీలో అవకాశాలకు కొదవేం లేదు. ఒకప్పుడు సినిమాల్లో  అవకాశం కోసం ఆఫీస్ లు చుట్టూ తిరగాల్సి వచ్చేది కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. టాలెంట్ నిరూపించుకోవడానికి అనేక వేదికలు అందుబాటులో ఉన్నాయి. టాలెంట్ ను గుర్తుపట్టి అవకాశాలు ఇచ్చేవారి సంఖ్యా పెరిగింది. సినీ ఇండస్ట్రీలోకి అలా చాలా మంది హీరోలే వచ్చారు. అలా సొంత టాలెంట్ తో పైకొచ్చిన యువ హీరోలలో విశ్వక్ సేన్ ఒకరు. ఫలక్నుమా దాస్ సినిమాతోనే విశ్వక్ సేన్ టాలెంట్ ఏంటో తెలుగు ప్రేక్షకులకు అర్థమైపోయింది. సైలెంట్ గా వచ్చిన ఆ సినిమా మంచి మాస్ హిట్ గా నిలిచింది. ఆ సినిమాలో విశ్వక్ నటన, యాటిట్యూడ్ ఎంతో మందిని ఫ్యాన్స్ గా  మార్చింది. ఆ సినిమా తర్వాత విశ్వక్ ఇక వెనుతిరిగి చూడలేదు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకెళ్తూ ఇండస్ట్రీ దృష్టిని ఆకట్టుకుంటున్నారు. ఇంతకుముందు విడుదలైన పాగల్, అశోకవనంలో అర్జున కల్యాణం సినిమా విశ్వక్ లో మనో నటుడ్ని పరిచయం చేసింది. విశ్వక్ కు ఫ్యామిలీ ఆడియన్స్ నూ దగ్గర చేసింది. 


విశ్వక్ సేన్ తాజాగా నటించిన సినిమా 'ఓరి దేవుడా' విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు చిత్ర బృందం. ఈ వేడుకలో డీజే టిల్లు ఫేమ్ సిద్దూ జొన్నలగడ్డ పాల్గొన్నారు. రియల్ లైఫ్ లోనూ వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ కూడా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సినిమా విషయంలో విశ్వక్ సేన్ ఎంతో డెడికేటెడ్ గా పనిచేస్తారని అన్నారు. సినిమా పట్ల మెంటల్, క్రేజీ ఫెలో లా విశ్వక్ ఉంటారని, ఏదైనా చేయాలి అనుకుంటే అది చేసే వరకూ నిద్రపోడని అన్నారు. సినిమా అంటే అంత ప్రొఫెషనల్ గా ఉంటాడని కితాబిచ్చారు. అదే స్పీడ్ తో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నాడని అన్నారు. సినిమాలు చేయడంలో విశ్వక్ తనకంటే ఫాస్ట్ గా ఉన్నాడని అన్నారు. అతని నుంచి మా లాంటి హీరోలు ఎంతో నేర్చుకోవాలని చెప్పారు. విశ్వక్ సేన్ ఫ్యూచర్ లో సూపర్ స్టార్ కావడం ఖాయమని వ్యాఖ్యానించారు. 


ఈ మల్టీ స్టారర్ సినిమాలో విక్టరీ వెంకటేశ్ దేవుడిగా నటించారు. సినిమాలో దేవుడి క్యారెక్టర్ కూడా ఎంతో స్టైలిష్ గానే రూపొందించారు. అశ్వత్ మారిముత్తు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. పీవీపీ - శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి, లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందించారు. హీరోయిన్లుగా మిథిల పాల్కర్, ఆశా భట్ కనిపించనున్నారు. ఓ రొమాంటిక్, కామెడీ జోనర్ లో సినిమా ఉంటుందని ఇప్పటికే చిత్ర బృదం చెప్పింది. సాధారణంగా మల్టీ స్టారర్ సినిమాలన్నీ దాదాపు హిట్ అయిపోతాయి. మరి ఒక కొత్త కాన్సెప్ట్ తో వస్తోన్న ఈ రొమాంటిక్, కామెడీ డ్రామా తెలుగు ప్రేక్షకులను ఎంతమేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. ఈ సినిమా ఈ నెల 21 న థియేటర్లలోకి రానుంది.


Also Read: సుమతో ఆడేసుకున్న అనుదీప్, శివ కార్తికేయన్ - ఆ పంచులకు నవ్వు ఆగదు!